ETV Bharat / state

వైసీపీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్ట్‌లు - మరమ్మతులు లేక కొట్టుకుపోతున్న గేట్లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 9:25 AM IST

Updated : Dec 10, 2023, 1:47 PM IST

Negligence_of_Projects_in_YCP_Government
Negligence_of_Projects_in_YCP_Government

Negligence of Projects in YCP Government : వైసీపీ హయాంలో ప్రాజెక్ట్‌ల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. కొత్త ప్రాజెక్ట్‌లు కట్టడం సంగతి దేవుడెరుగు ఉన్నవాటికే మరమ్మతులు నోచుకోక కొట్టుకుపోతున్నాయి. పులిచింతల, గుండ్లకమ్మలో గేట్లు కొట్టుకుపోయాయి. ఇక పోలవరం పనుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని జలవనరులశాఖ అధికారులు గుసగుసలాడుతున్నారు.

వైసీపీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్ట్‌లు - మరమ్మత్తులు లేక కొట్టుకుపోతున్న గేట్​లు

Negligence of Projects in YCP Government : వరదలకు డ్యాంలు కొట్టుకుపోయినప్పుడో నీటి తాకిడికి ప్రాజెక్ట్‌ గేటులు తెగిపోయినప్పుడో హడావుడిగా సమీక్షలు చేయడం ఆ తర్వాత దాన్ని మర్చిపోవడం వైసీపీ ప్రభుత్వానికి రివాజుగా మారింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఖాళీలు భర్తీ చేయాలంటూ సరిగ్గా రెండేళ్ల క్రితం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన సందర్భంగా సీఎం అన్నారు.

ఆంధ్రావని జీవనాడిపై జగన్ అలసత్వం - రివర్స్‌గేర్‌లో పోలవరం పనులుఒక గేటు కొట్టుకుపోయినా బుద్దిరాలేదు - ఇప్పుడు మరో గేటు తెగిపడింది !

కానీ నేటికీ అవేమీ అమలు కాలేదు. కొత్త ప్రాజెక్ట్‌ల సంగతి దేవుడెరుగు ఉన్నవాటికి మరమ్మతులు చేపట్టకపోవడంతో కొట్టుకుపోతున్నాయి. శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టులో మరో గేటు కొట్టుకుపోయింది. ఇక పోలవరం సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో జగన్ హయాంలో జరిగినంత నిర్లక్ష్యం, విధ్వంసం బహుశా ఇంక ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని జలవనరులశాఖ అధికారులే చెప్పుకుంటున్నారు.

Problems of Gundlakamma Project : గుండ్లకమ్మ ప్రాజెక్టులో తలుపులు తుప్పుపట్టాయని, మార్చుకోవాలని నివేదికలు పంపినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. మరమ్మతులకు రూ. 3 కోట్లు ఇవ్వకపోవడంతో 2022 ఆగస్టు 31న రాత్రి గుండ్లకమ్మలో గేటు కొట్టుకుపోయింది. ఏడాది గడిచిపోయినా నిధులు ఇవ్వకపోవడంతో రెండో నంబరు గేటు శుక్రవారం కొట్టుకుపోయింది. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల్లో మట్టి డ్యాంలు కొట్టుకుపోయాక సీఎం జగన్‌ సమీక్షించి ఇచ్చిన హామీలు గాలికి కొట్టుకుపోయాయి.

'నమ్మించు వంచించు'- సొంత జిల్లా ప్రజలను మోసం చేయడానికి సీఎం జగన్ కొత్త పథకం.

Present Status of Pulichintala Project : 2021 ఆగస్టు 5 తెల్లవారుజామున పులిచింతల ప్రాజెక్టులో 16వ నంబరు గేటు 750 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. టై ప్లాట్స్‌ పూర్తిగా తెగిపోయాయి. రెండేళ్లుగా గేట్ల నిర్వహణ, ఇతర సాధారణ అంశాలనూ పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు తేల్చారు. 2020లో తెలంగాణలో భారీ వర్షాలు కురవగా దిగువన ఎలాంటి సన్నద్ధత చర్యలు చేపట్టకపోవడం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 51 గ్రామాలు ముంపులో చిక్కి వేల హెక్టార్లలో పంట దెబ్బతింది.

Current Situation of Srisailam Project : 2020 ఆగస్టు, 2021 సెప్టెంబరు నెలల్లో శ్రీశైలం జలాశయం నిర్వహణ తీరుపై విమర్శలు వచ్చాయి. క్రస్టుగేట్ల పైనుంచి నీరు వరదలా ప్రవహించింది. దీనివల్ల రేడియల్‌ గేట్లలో ఉండే ఇంజిస్‌ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమయింది. గేట్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే అన్నమయ్య జలాశయం కొట్టుకుపోయి 39 మంది మరణించారు. 2021లో వర్షాలకు పింఛా ప్రాజెక్ట్‌ మట్టికట్ట కొట్టుకుపోయింది. ప్రాజెక్ట్‌లపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వంలో కీలకస్థానంలో ఉన్న ఒక సాగునీటి రంగ ప్రముఖుడు సైతం తప్పుబట్టాడు.

ఇక పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రభుత్వ సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. స్పిల్‌వేకు ఎగువన రక్షణ కోసం నిర్మించిన గైడ్‌బండ్‌ కుంగిపోయింది. వైసీపీ హయాంలో చేపట్టిన నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, డిజైన్లకు అనుగుణంగా, తగిన సమయంలో కట్టడం పూర్తి చేయకపోవడమే గైడ్‌బండ్‌ కుంగిపోవడానికి కారణమని నిపుణులు తేల్చారు. 2019 జూన్‌ నాటికి పోలవరంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో కొంత గ్యాప్‌ వదిలేశారు.

Low Water Storage in Reservoirs: జలాశయాల్లో నీటి కొరత.. సెప్టెంబరులోనైనా వరుణుడు కరుణించాలని రైతుల ఆశలు

Status of Projects in AP : వైసీపీ హయాంలో వాటిని సకాలంలో పూడ్చలేదు. దీంతో 2020 భారీ వరదలకు అక్కడ పెద్ద విధ్వంసమే జరిగింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట నదీగర్భంలో పెద్ద పెద్ద అగాథాలు ఏర్పడ్డాయి. ప్రధాన డ్యాం నిర్మాణానికి అదో అవాంతరంగా మారింది. 2020 భారీ వరదలకు పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్‌ ధ్వంసమయింది. సకాలంలో ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లు పూడ్చకపోవడమే ఇందుకు కారణం.

ఇప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ రెండు కాఫర్‌ డ్యాంలు నిరుపయోగంగా తయారయ్యాయి. ఎగువ కాఫర్‌ డ్యాం పెండింగు పనులు పూర్తిచేసింది, దిగువ కాఫర్‌ డ్యాం నిర్మించిందీ జగన్‌ హయాంలోనే. వాటి సీపేజీ నీటితో ప్రధాన డ్యాం ప్రాంతం నిండిపోతోంది. పనులకు ఆటంకం కలుగుతోంది. దీన్ని ఎలా పరిష్కరించాలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వాహణపై విపక్షాల ధ్వజం

Last Updated :Dec 10, 2023, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.