ETV Bharat / state

'నమ్మించు వంచించు'- సొంత జిల్లా ప్రజలను మోసం చేయడానికి సీఎం జగన్ కొత్త పథకం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 9:31 AM IST

Updated : Nov 11, 2023, 11:23 AM IST

CM Jagan Has Been Cheating People for Two Years: రాష్ట్ర ప్రజలనే కాదు.. సొంతజిల్లా వాసులను ముఖ్యమంత్రి జగన్ నమ్మించి వంచించారు. నా జిల్లా, మన జిల్లా అంటూ జనాన్ని మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని భూతలస్వర్గం చేయబోతున్నామంటూ ఆయన చెబుతున్న మాటలకు.. చేతలకు ఆకాశం, భూమికి ఉన్నంత అంతరం ఉంటోంది.

cm_jagan_cheating_people
cm_jagan_cheating_people

'నమ్మించు వంచించు'- సొంత జిల్లా ప్రజలను మోసం చేయడానికి సీఎం జగన్ కొత్త పథకం

CM Jagan Has Been Cheating People for Two Years: ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా ప్రజలను మాటలతో ఏమారుస్తున్నారు. 2021లో బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గం పరిధిలో సుమారు 500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. కొన్ని పనులకు హడావుడిగా ఆయనే స్వయంగా శంకుస్థాపనలు సైతం చేశారు. ఎన్నికల్లో నెగ్గిన వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట మరిచారు. సీఎం శంకుస్థాపనలు చేసి రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ అక్కడ 25శాతం పనులు కూడా జరగలేదు. కొన్ని పనులను ఇప్పటికీ ఆమోదించలేదంటే ఆయన చేసిన మోసం ఏంటో ఇప్పుడిప్పుడే జిల్లా ప్రజలకు తెలుస్తోంది. బద్వేల్‌లో సీఎం శంకుస్థాపన చేసిన 6 శ్మశాన వాటికల్లో ఒక్కటీ పూర్తవ్వలేదు. 96 కోట్లతో సిమెంట్‌ రోడ్లు, కూరగాయల, చేపల మార్కెట్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. రోడ్ల నిర్మాణం అరకొరగా సాగగా పార్కుల అభివృద్ధి ఊసే లేదు..

YCP Govt Paying Bills Only Jagan Followers: 'వరుస' తప్పిన వైసీపీ సర్కారు..! పక్కదోవలో జగన్ అనుచరులకు వేల కోట్ల పందేరం

బద్వేలు నియోజకవర్గంలో 500 కోట్ల పనుల్లో భాగంగా బద్వేలు. మున్సిపాలిటీలో ఆరు శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తాముంటూ అప్పట్లో ఆరు శ్మశానవాటికలకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లయినా వాటిలో ఒక్క పని కూడా పూర్తి కాలేదు. బద్వేలు పట్టణంలో సుమారు 96 కోట్ల అంచనాతో 140 కిలోమీటర్ల మేర కొత్తగా సిమెంటు రోడ్లతో పాటు మూడు పార్కులు, కూరగాయలు, చేపల మార్కెట్ పార్కింగ్‌తో సహా అభివృద్ధి చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. రోడ్లకు సంబంధించి వివిధ వార్డుల్లో 11 పనులకు అప్పట్లో శ్రీకారం చుట్టగా రెండేళ్ల తర్వాత ఇప్పటికీ 50 కోట్ల పనులు మాత్రమే చేపట్టారు. మొత్తం రోడ్ల పనులు 7 నుంచి 97 శాతం మధ్య ఇంకా పురోగతిలోనే ఉన్నాయని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. 6.70 కోట్లతో ఎన్జీవో కాలనీ, గాంధీనగర్ కాలనీల్లో పార్కులతో పాటు సిద్ధవరం రోడ్డు పార్కునూ అభివృద్ధి చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ అవి అందుబాటులోకి రాలేదు.

How CM Jagan Cheating AP People: పథకాల్లో 'కోతలు'.. ప్రసంగాల్లో 'కోతలు'.. పెత్తందారు 'ఎవరు' జగన్​?..

Jagan Promises in Badwelu Constituency..

  • బద్వేలు నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం 480 ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయించారు. దానికి అతికష్టంపై 3 కోట్ల 70 లక్షలతో అప్రోచ్ రోడ్డును నిర్మించారు. ఇప్పటివరకు దీనికి నీటి వసతి, విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించలేదు.
  • సగిలేరుపై ఒకచోట 9 కోట్ల 50 లక్షలతో, మరోచోట 20 కోట్ల రూపాయల అంచనాతో రెండు వంతెనల నిర్మాణ పనుల్లోనూ అడుగు ముందుకు పడలేదు.
  • బ్రాహ్మణపల్లిలో రోడ్డులో 9కోట్ల 50 లక్షలతో నిర్మించతలపెట్టిన వంతెన పనులకు డీపీఆర్​ను మాత్రం సమర్పించారు. రెండో వంతెనకు డీపీఆర్​ కూడా పూర్తి కాలేదు.
  • ఇటుగులపాడు, సవిశెట్టిపల్లి, కొండ్రాపల్లె, వరికుంట్ల, గంగనపల్లి ప్రాంతాల్లోని చెరువులను నింపేందుకు ఎస్​పీవీబీఆర్​ ఎడమ కాలువపై ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకం పనులను గుత్తేదారుకు అప్పగించినా పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
  • 79 కోట్ల 67 లక్షలతో ప్రతిపాదించిన సగిలేరు ఎడమ ప్రధాన కాలువ విస్తరణ పనులూ ఇప్పటికీ పూర్తి కాలేదు.
  • పోరుమామిళ్ల మార్కెట్ యార్డులో గోదాము, మరుగుదొడ్లు, కార్యాలయ భవనం, ప్రహరీ పనులను మొత్తం 3 కోట్ల 96 లక్షలతో చేపడతామని ప్రకటించారు. వీటిలో ప్రహరీ మాత్రమే పూర్తయింది. మిగిలిన పనులు ఇంకా పురోగతిలోనే ఉన్నాయి.
  • పోరుమామిళ్ల పట్టణ పరిధిలో మైదుకూరు తాటిచెర్ల రోడ్డును 2 నుంచి 4 వరుసలుగా విస్తరించేందుకు 25 కోట్లతో శంకుస్థాపన చేయగా ఇప్పటికి 25 శాతంలోపే పనులు పూర్తయ్యాయి.

YSRCP Government Did Not Fund the Drinking Water Schemes: ఆరంభ శూరత్వంగా మిగిలిపోతున్న తాగునీటి పథకాలు.. నిధులివ్వని జగన్‌ ప్రభుత్వం

Last Updated : Nov 11, 2023, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.