ETV Bharat / state

ఎన్నికల సిబ్బంది..భోజనాల్లేక ఇబ్బంది

author img

By

Published : Feb 16, 2021, 8:39 AM IST

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్లలోని 11 మండలాల్లో మూడో విడత ఎన్నికల్లో వీరికి విధులు కేటాయించారు. ఆహార పొట్లాల కోసం పంచాయతీ ఎన్నికల సిబ్బంది ఎగబడుతున్నారు.

Trouble with meals for election staff at eastgodavari district
ఎన్నికల సిబ్బంది..భోజనాల్లేక ఇబ్బంది

ఆహార పొట్లాల కోసం ఎగబడుతున్న వీరంతా పంచాయతీ ఎన్నికల సిబ్బంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్లలోని 11 మండలాల్లో మూడో విడత ఎన్నికల్లో వీరికి విధులు కేటాయించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి రాగా.. మధ్యాహ్న భోజనం ఆలస్యమైంది. క్యూలైన్లలో నిరీక్షించిన సిబ్బంది.. చివరకు ఓపిక నశించి ఇలా గుంపులుగా ఎగబడ్డారు. హోటళ్ల నుంచి భోజనాలు తీసుకురావడంలో ఆలస్యమైనందున సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

విజయవాడ సంగీత కళాశాలలో అఖండ కచ్ఛపి మహోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.