ETV Bharat / state

ఆ జాతరలో వేషం వేయాల్సిందే... జోలె పట్టాల్సిందే... అట్లైతేనే మెుక్కు చెల్లుతుంది

author img

By

Published : Mar 1, 2022, 3:05 PM IST

Sattemma Talli Fair
Sattemma Talli Fair

Sattemma Talli Fair: లక్షాధికారులైనా... బీదవారైనా ఆ రోజు... అక్కడ జోలె పట్టి భిక్షాటన చేస్తారు. విదేశాల్లో స్థిరపడినవారు సైతం విచిత్ర వేషాలతో అలరిస్తారు..పెద్ద పెద్ద చదవులు చదివినవారు పాములు ఆడిస్తారు. ఏంటీ..! ఇలా చెబుతున్నారని అనుకుంటున్నారా... అవును ఇదంతా నిజమే.. అసలు ఇలా ఎందుకు చేస్తారు... ఎక్కడ చేస్తారో తెలుసుకుందామా..

Sattemma Talli Fair: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో.. రెండేళ్లకోసారి జరిగే సత్తెమ్మతల్లి అమ్మవారి జాతర.. వైభవంగా జరుగుతుంది. ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన సంప్రదాయాలు.. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోటీశ్వరులైనా, సామాన్యులైనా వివిధ రకాల వేషాలు ధరించడం జాతర ప్రత్యేకత. కోర్కెలు తీరిన భక్తులు ఏదో ఒక వేషం వేసి గ్రామ వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తారు. ఇలా వచ్చిన డబ్బు, బియ్యాన్ని ఆలయానికి సమర్పిస్తారు. ఆ సొమ్ముతో భక్తులకు అన్నదానం చేస్తారు. ఇలా నచ్చిన వేషం వేసి.. మొక్కులు చెల్లించడం ఈ జాతరలో సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది కూడా సంప్రదాయాన్ని కొనసాగించిన గ్రామస్థులు... వివిధ వేషధారణలతో జాతరను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సత్తెమ్మ తల్లి జాతర వేడుకలు

పూజారితో దెబ్బలు తినేందుకు పోటీ...

వేడుకల్లో భాగంగా.. మొదటి రోజు కత్తెరకుండను మిద్దెపై నుంచి కిందకు దించే ప్రక్రియతో జాతర ప్రారంభమవుతుంది. రెండవ రోజు గ్రామానికి చెందిన ఆడపడుచులు, బంధువులు.. ఏ ప్రాంతంలో ఉన్నా ఇళ్లకు చేరుకుంటారు. వివిధ వేషాలు ధరించి ఆలయం వద్దకు చేరుకుంటారు. గుడిలోకి పూజారిని ప్రవేశించకుండా అడ్డుపడతారు. కోపోద్రిక్తుడైన పూజారి భక్తులకు బడితపూజ చేస్తారు. ఈ సమయంలో పూజారితో దెబ్బలు తినేందుకు భక్తులు పోటీపడతారు.మూడో రోజు గ్రామమంతా సందడి వాతావరణం కనిపిస్తుంది. కోటీశ్వరులైనా, సామాన్యులైనా వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకుంటారు. కోర్కెలు తీరిన భక్తులు ఏదో ఒక వేషం వేసి గ్రామ వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తారు. ఇలా వచ్చిన డబ్బు, బియ్యాన్ని ఆలయానికి సమర్పిస్తారు. ఆ సొమ్ముతో భక్తులకు అన్నదానం చేస్తారు. ఈ సారి కూడా సంప్రదాయాన్ని కొనసాగించిన గ్రామస్థులు... జాతరను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున్న అమ్మవారిని దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్, ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి వేరువేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు

ఇదీ చదవండి: చిన్న సీసాలో 'శివ' లింగం.. 23 వేల రుద్రాక్షలతో సైకత శిల్పం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.