ETV Bharat / state

ఎడతెరిపిలేని వర్షాలు.. పొంగి ప్రవహిస్తున్న వాగులు

author img

By

Published : Jul 6, 2020, 11:27 AM IST

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా మన్యంలో వాగు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భూపతిపాలెం, ముసురుమిల్లి జలాశయాల్లో నీరు భఆరీగా చేరింది.

heavy rains in east godavari agency
ఎడతెరిపిలేని వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న వాగులు

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో వాగు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాజవొమ్మంగి మండలం జడ్డంగి వద్ద ఉన్న మడేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. అలాగే రాజవొమ్మంగి-ముర్లవానిపాలెం రహదారిలో ఉన్న కల్వర్టు వాగు వరద ఉధృతితో కొట్టుకుపోయింది. రంప చోడవరంలో వాడపల్లి వెళ్లే రహదారిలో కొండ వాగులు పొంగి ప్రవహించడం వల్ల రాకపోకలు స్తంభించాయి. ఆదివారం వారపు సంత కావడం వల్ల నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇవీ చూడండి...

తప్పిపోయిన వృద్ధుడు.. పోలీసులకు కుటుంబసభ్యుల ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.