ETV Bharat / state

గోదావరికి పెరిగిన వరద... పలుచోట్ల రాకపోకలకు అంతరాయం

author img

By

Published : Sep 6, 2019, 9:45 AM IST

గోదావరిలో వరద ప్రవాహం పెరగటంతో.... దేవీపట్నంలో వాగుల్లోకి, రహదారులపై నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ స్తభించింది.

గోదావరిలో తగ్గని వరదప్రవాహాం... పలుచోట్ల రాకపోకలకు అంతరాయం

రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10 అడుగులకు నీటిమట్టం చేరింది. డెల్టా కాల్వలకు 9,800 క్యూసెక్కులు విడుదల చేయగా...సముద్రంలోకి సుమారు 5.39 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. దేవీపట్నం మండలంలో వాగుల్లోకి, రహదారులపైకి భారీగా వరద నీరు చేరటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇవీ చదవండి

బామ్మ సంకల్పం... వృద్ధాప్యంలో అమ్మతనం

Intro:Ap_Nlr_01_05_Karmika_Sangaala_Andolana_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
కార్మిక చట్టాల మార్పును వ్యతిరేకిస్తారు నెల్లూరులో సి.ఐ.టి.యు., రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించిన కార్మిక సంఘాలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఈ సందర్భంగా వామపక్ష నేతలు విమర్శించారు. బడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా చట్టాలు మార్చడం దారుణమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి జగన్, చిరు ఉద్యోగులకు అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలపై విడనాడకుంటే పోరాడుతామని ప్రకటించారు.
బైట్: అజయ్ కుమార్, సి.ఐ.టి.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి, నెల్లూరు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.