ETV Bharat / state

Suicide Attempt: కుమారుడు మాట్లాడటం లేదని... గోదావరిలో దూకిన వృద్ధుడు

author img

By

Published : Oct 6, 2021, 1:32 PM IST

Updated : Oct 6, 2021, 2:17 PM IST

suicide attempt
suicide attempt

13:30 October 06

తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

కుమారుడు మాట్లాడటం లేదని... గోదావరిలో దూకిన దూకి వృద్ధుడు ఆత్మహత్యాయత్నం

  కుమారుడు మాట్లాడటం లేదని మనస్థాపంతో ఓ వృద్ధుడు గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.  జిల్లాకు చెందిన మోరుల చిన్నయ్య(73) అనే వృద్ధుడికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మూడు రోజులుగా ఓ కుమారుడు తనతో మాట్లాడటం లేదనే మనస్థాపంలో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. చిన్నయ్య..  పి.గన్నవరం అక్విడెక్ట్ పైనుంచి గోదావరిలోకి దూకాడు. వరద నీటిలో సుమారు అర కిలో మీటర్ మేర కొట్టుకుపోయాడు. ఆ సమీపంలో ఇసుక తీస్తున్న బోటు నిర్వహకుడు సికిలే ఏసు .. చిన్నయ్యను గుర్తించి రక్షించారు. తన భార్య గతేడాది డిసెంబర్​లో మరణించిందని చిన్నయ్య తెలిపాడు.

ఇదీ చదవండి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి

Last Updated : Oct 6, 2021, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.