ETV Bharat / state

దేశానికి నేతాజీ సేవలు అపురూపం: ఎమ్మెల్యే కొండేటి

author img

By

Published : Jan 24, 2021, 12:58 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ ఫోటోకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్రం కోసం ఆయన అందించిన సేవలు అపురూపమన్నారు.

Netaji Subhash Chandra Bose Jayanti
తూర్పుగోదావరి జిల్లాలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహోన్నత వ్యక్తి అని శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు కొనియాడారు. నేతాజీ జయంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దేశ స్వాతంత్య్రం కోసం ఆయన అందించిన సేవలు అపురూరం అని కీర్తించారు. నేతాజీ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రపంచ దేశాల్లో భారత దేశాన్ని శక్తిశాలి దేశంగా నిర్మించాల్సిన బాధ్యత యువతపై ఉందని చెప్పారు.

ఇదీ చదవండి:

'ఎవరైనా చంపడానికి వస్తే.. చంపే హక్కు మాకుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.