ETV Bharat / state

'రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు'

author img

By

Published : Oct 28, 2020, 3:50 PM IST

Updated : Nov 2, 2020, 11:56 AM IST

nari-bheri round table meeting in rajamahendravaram east godavari district
రాజమహేంద్రవరంలో నారీ-భేరీ రౌండ్ టేబుల్ సమావేశం

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నారీ - భేరీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెదేపా నాయకులు పాల్గొన్నారు. వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చాక మహిళలపై వేధింపులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలపై వేధింపులను నిరసిస్తూ... రాజమహేంద్రవరంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నారీ - భేరీ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలవూడి అనిత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, మాజీ మంత్రి జవహర్, ఇతర నాయకులు హాజరయ్యారు.

మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు... పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని అనిత ఆరోపించారు. గత 17 నెలలుగా మహిళలపై నేరాలు జరుగుతూనే ఉన్నాయని, ముఖ్యమంత్రే స్వయంగా నగరంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించినప్పటికీ... మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయని ఎమ్మెల్యే భవానీ అన్నారు. తనపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తన పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు

ఇదీ చదవండి:

విద్యుత్ ఉద్యోగ సంఘాలతో మంత్రి బాలినేని చర్చలు

Last Updated :Nov 2, 2020, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.