ETV Bharat / state

అన్నవరం దేవస్థానంలో మరో 102 నిఘా నేత్రాలు.. ధర్మకర్తల మండలి ఆమోదం

author img

By

Published : Jan 21, 2021, 8:44 AM IST

అన్నవరం దేవస్థానంలో రూ. 10.85 లక్షల వ్యయంతో అదనంగా మరో 102 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.

More surveillance cctv cameras at Annavaram temple eastgodavari district
అన్నవరం దేవస్థానంలో మరిన్ని నిఘా నేత్రాలు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో భద్రత మరింత కట్టుదిట్టం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రూ. 10.85 లక్షలతో ఆలయ ప్రాంగణంలో మరో 102 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.

టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఛైర్మన్‌ రోహిత్‌ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అజెండాలోని 18 అంశాలతో పాటు, ఆలయానికి సంబంధించిన మిరిన్ని కీలక విషయాలపైనా చర్చించారు.

ఇదీ చదవండి:

ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.