ETV Bharat / state

Mango Egg: మామిడికాయ గుడ్డు.. మీరెప్పుడైనా చూశారా..?

author img

By

Published : Mar 16, 2022, 10:33 AM IST

Mango egg: వినాయకుడి ఆకారంలో ఉన్న బొప్పాయిని చూసుంటారు... చిట్టి పిట్టల్లా కనిపించే ఆకులను చూసే ఉంటారు... రామచిలుక ముక్కులా ఉండే పుష్పాలనూ చూసుంటారు... మరి మామిడి కాయ ఆకారం కలిగిన కోడి గుడ్డును ఎప్పుడైనా చూశారా..? చూడకపోతే ఇప్పుడు చూడండి..

Mango egg
కోడి గుడ్డు ఆకారాన్ని పొందిన మామిడి

Mango Egg: ప్రపంచంలో నిత్యం ఏదో ఒకచోట ఏదో ఒక విచిత్రం జరుగుతూనే ఉంటుంది. అలాంటి విచిత్రమే తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఇదిగో ఈ చిత్రం చూశారు కదా..! ఒకటి మామిడి కాయ.. రెండోది ఏంటీ?..

మామిడికాయ తెల్ల రంగులోకి మారిందనుకుంటున్నారా.. సరిగ్గా చూడండి.. ఇది కోడిగుడ్డు. మామిడి కాయ ఆకారంలో చూపరులను ఆశ్చర్యపరిచిన ఈ గుడ్డు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని సత్తిబాబు కిరాణా దుకాణంలో కనిపించింది. మామిడికాయ, గుడ్డూ రెండూ పక్కపక్కనే పెట్టగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

ఇదీ చదవండి:

"ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే నా బిడ్డ చనిపోయింది... లేకుంటే బతికేది"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.