ETV Bharat / state

పంటసాగుపత్రాలు పంచిన మంత్రి కన్నబాబు

author img

By

Published : Jul 21, 2020, 11:52 AM IST

రైతులకు బ్యాంకులు రుణ మంజూరులో సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన పంట సాగుదారు హక్కుల అవగాహన కార్యక్రమంలో కౌలుదారులకు మంత్రి పత్రాలు అందించారు.

faremrs cards distributes by minister kannababu in east godavari dst
faremrs cards distributes by minister kannababu in east godavari dst

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ తమ్మవరంలో ఏర్పాటు చేసిన పంట సాగుదారు హక్కుల అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. పంట సాగు దారు హక్కు పత్రాన్ని రైతులకు అందజేశారు. పక్షోత్సవాలు గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఈ పక్షోత్సవాలు నేటి నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతును ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. భూ యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా ఈ పత్రం ఉపయోగపడుతుందన్నారు.

జిల్లాలో 57620 మంది కౌలు రైతులకు ఈ పత్రాలను అందించామన్నారు. రాష్ట్రంలో మరో రెండు లక్షల మంది కౌలు రైతులకు నూతనంగా ఈ పత్రాలను అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

ప్రస్తుతం అధిక వర్షపాతం ఉండడంతో జిల్లాలో సుమారు 500 ఎకరాల వరి నారు నీట మునిగిందని అన్నారు. 80 శాతం రాయితీతో నష్టపోయిన రైతులకు విత్తనాలు అందిస్తామని తెలిపారు. తమ్మవరం రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు.

ఇదీ చూడండి

సెప్టెంబర్ 5 న పాఠశాలలు పున: ప్రారంభించే అవకాశం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.