ETV Bharat / state

కొవ్వూరు టీడీపీలో చెలరేగిన విభేదాలు

author img

By

Published : Nov 26, 2022, 7:16 PM IST

TDP : తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల కోసం సమావేశమైన సభ వేదిక పైకి మాజీ మంత్రిని పిలవక పోవటంతో విభేదాలు చెలరేగాయి.

Differences TDP
కొవ్వూరు టీడీపీలో విభేదాలు

Differences In TDP: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. డిసెంబర్ 1న చంద్రబాబు పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై ఆ పార్టీ నేతలు సమావేశమవ్వగా.. మాజీమంత్రి జవహర్‌ను వేదికపైకి పిలవలేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి టుమెన్ కమిటీ సభ్యులు, జవహర్ వర్గీయులు హాజరయ్యారు. ఈ క్రమంలో జవహర్‌ను వేదికపైకి పిలవలేదంటూ ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాలు మధ్య తోపులాట చోటుచేసుకోవడంపై బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతటివారినానై సహించేది లేదని హెచ్చరించారు.

కొవ్వూరు టీడీపీలో విభేదాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.