ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు @7am

author img

By

Published : Dec 27, 2022, 6:58 AM IST

..

7am topnews
ప్రధానవార్తలు 7am

  • పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
    అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీని ప్రమాదాలు వెంటాతున్నాయి. సోమవారం మధ్యాహ్నం లారస్ ల్యాబ్స్‌లో భారీ అగ్నిప్రమాదంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అగ్నికీలల్లో నలుగురు సజీవ దహనమవ్వగా.. మరొకరు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. సాల్వెంట్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇంటర్​ పరీక్షల షెడ్యూల్​ విడుదల.. ఎప్పటినుంచంటే..!
    రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల అయ్యింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15నుంచి ప్రారంభం కానుండగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూలైన్లలోకి అనుమతించకపోవడంతో ఆందోళన
    క్యూలైనులోకి తితిదే సిబ్బంది అనుమతించడం లేదని ఎస్వీ మ్యూజియం వద్ద భక్తులు నిరసనకు దిగారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉండగా.. ఇప్పటికే వైకుంఠం క్యూకాంప్లెక్స్​లు భక్తులతో నిండిపోయాయి. తిరుమంజనం దృష్ట్యా శ్రీవారి దర్శనం ఆలస్యమయ్యే అవకాశముంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అక్రమ ఆయుధాల విక్రయ ముఠా అరెస్ట్​.. 18 ఆయుధాలు స్వాధీనం
    నకిలీ కరెన్సీ కేసులో నిందితులను విచారిస్తుండగా అక్రమ ఆయుధాల విక్రయాలకు సంబంధించిన సమాచారం బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బెంగళూరుకు చెందిన ముఠాను అరెస్ట్​ చేశారు. మధ్యప్రదేశ్​లో తయారీ కేంద్రం ఉందని గుర్తించారు. 18 ఆయుధాలు, 95 రౌండ్ల బుల్లెట్లు, 6 అదనపు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ రాజేంధ్రనాథ్​రెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం.. 39రోజుల్లోనే రూ.223 కోట్లు
    శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. 39 రోజుల వ్యవధిలో రూ.222 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు దేవస్థానం వెల్లడించింది. స్వామి దర్శనానికి చిన్నారులు అధిక సంఖ్యలో వచ్చారని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పార్కింగ్ ప్రదేశంలో 20 కార్లు దగ్ధం.. స్కూల్​ బస్సులో మంటలు.. 19 మంది..
    బహుళ అంతస్తు పార్కింగ్ సముదాయంలో ఓ యువకుడు కారుకు నిప్పంటించాడు. దీంతో ఆ పార్కింగ్ సముదాయంలో ఉన్న 20 కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు, ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన గుజరాత్​లో జరిగింది. అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొవిడ్​తో చైనీయులు నరకయాతన.. శవాలతో శ్మశానాలు ఫుల్.. 25కోట్ల మందికి వైరస్
    చైనాలో పరిస్థితులు ఊహించిన దానికంటే మరింత దారుణంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుట్టలుగా పేరుకుపోయిన శవాలే కనిపిస్తున్నాయి. శ్మశానాల వద్ద ఎక్కడ చూసినా శవాలను మోసుకొస్తున్న వారితో క్యూలు దర్శనమిస్తున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు లేక..అంబులెన్స్‌ల్లోనే రోజుల తరబడి చికిత్స చేయాల్సి వస్తోంది. రాజధాని బీజింగ్‌తో సహా ఎక్కడ చూసినా ఆత్మీయులను పోగొట్టుకున్న వారి రోదనలు ప్రతిధ్వనిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 40 కోట్ల ట్విట్టర్ యూజర్ల ​డేటా చోరీ.. సుందర్ పిచాయ్, డబ్ల్యూహెచ్​ఓ సహా..
    ట్విట్టర్​కు సంబంధించిన 40 కోట్ల మంది వినియోగదారుల డేటాను చోరీ చేసినట్లు హ్యాకర్​ తెలిపాడు. ట్విట్టర్​ తన నుంచి ఈ డేటాను కొనుకోలు చేయవచ్చని చెప్పాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెలీ సైబర్ సంస్థ హడ్సన్ రాక్ వెల్లడించింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్​, డబ్ల్యూహెచ్​వో, కేంద్ర సమాచారం మంత్రిత్వ శాఖ ట్విట్టర్ డేటా చోరీకి గురైనట్లు పేర్కొంది. మరోవైపు ట్విట్టర్​ సీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నానని ఇండో అమెరికన్ వీ.ఏ అయ్యాదురై తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అశ్విన్​ విశ్వరూపం.. ఆ కామెంట్లపై ఘాటు స్పందన.. భారత జెర్సీ ధరించినప్పటి నుంచి అంటూ..
    బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించడంలో రవిచంద్రన్ అశ్విన్‌ది కీలక పాత్ర. బౌలింగ్‌లోనే కాకుండా కీలక సమయంలో బ్యాటింగ్‌లోనూ రాణించి ఓటమి నుంచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే తనపై వచ్చే విమర్శలకు ఎప్పటికప్పుడు తన ఆటతోనే కాకుండా సోషల్‌ మీడియాలోనూ సమాధానం ఇస్తుంటాడు. తాజాగా అలాగే మరోసారి స్పందించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సుకుమార్ కథకు ప్రభాస్​ గ్రీన్​ సిగ్నల్​.. కన్నడ దర్శకుడికి రామ్​ చరణ్​ ఓకే!
    పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​, మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా ఈ ఇద్దరు హీరోలు కొత్త సినిమాలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారట. రామ్​చరణ్​ ఓ కన్నడ కథను ఓకే చేశారట. మరోవైపు, ప్రభాస్​.. సుకుమార్​తో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.