ETV Bharat / state

దొంగతనానికి వెళ్లాడు... గురకపెట్టి నిద్రపోయాడు

author img

By

Published : Sep 13, 2020, 5:29 AM IST

Updated : Sep 13, 2020, 10:39 AM IST

ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిన వ్యక్తి... గురకపెట్టి నిద్రపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. మంచం కిందకు దూరిన ఆ దొంగ... నిద్రలోకి జారుకున్నాడు. గురక శబ్ధంతో అతన్ని గుర్తించిన ఇంటి యజమాని... పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

a thief went to steal and fell a sleep in east godavari district
a thief went to steal and fell a sleep in east godavari district

ఓ యువకుడికి దొంగతనం చేయాలనే దుర్బుద్ధి పుట్టింది. దాని కోసం ఓ ఇంటిని ఎంచుకుని పథకం వేశాడు. అనుకోని విధంగా ఆ ఇంట్లో చిక్కుకుని గురకపెట్టి నిద్రపోయి దొరికిపోయాడు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన చవుటపల్లి సురేష్(21) శుక్రవారం రాత్రి స్థానికంగా ఉండే ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించాడు. చోరీ ప్రయత్నంలో ఉండగా... యాజమాని రావడం గుర్తించి అతడి కంట పడకుండా మంచం కింద దాక్కున్నాడు. వ్యాపారి నిద్రపోయిన తరవాత బయటకు రావాలని భావించి అక్కడే నిరీక్షిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. వేకువజామున మంచం కింద నుంచి గురక శబ్ధం రావడం గుర్తించిన వ్యాపారి... దొంగను చూసి ఆందోళన చెందాడు. వెంటనే గదికి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించటంతో అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి

నిన్న పెళ్లి.... నేడు మృతి

Last Updated :Sep 13, 2020, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.