COLLAPSE ARCH: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. కూలిన తితిదే స్వాగత తోరణం

author img

By

Published : Sep 19, 2021, 1:57 PM IST

Updated : Sep 19, 2021, 6:07 PM IST

Due lorry driver mistake ttd welcome arch collapsed in tirupathi

13:55 September 19

తప్పిన పెను ప్రమాదం

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తిరుపతిలో తితిదే స్వాగత తోరణం (collapse arch) కూలింది. నగరికి చెందిన ఓ లారీ.. ఆర్టీసీ బస్టాండ్ నుంచి రామానుజకూడలి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణిస్తోంది. టిప్పర్​ వెనక బాడీ అమాంతంగా పైకి లేచిపోయింది. దానిని గమనించిన డ్రైవర్​ అలాగే నడిపించాడు. కొంత దూరం వెళ్లాక దారిలో తితిదే ఏర్పాటు చేసిన హోర్డింగ్​ను బలంగా ఢీకొట్టింది. దీంతో స్వాగత తోరణం కుప్పకూలిపోయింది. రహదారిపై ఎదురుగా వస్తున్న ఓ భక్తుడి కారుపై కూలిన తోరణం పడిపోయింది. అయితే కారులోని భక్తులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

రోడ్డుకు ఇరువైపులా హోర్డింగ్ పడిపోవడంతో  బస్టాండ్​కు బస్సుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. సుమారు మూడు గంటలపాటు ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. దీంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు.. శ్రీనివాస సేతు నిర్మాణ సంస్థ ఆఫ్కాన్ సహకారంతో హోర్డింగ్ తొలగించి..పరిస్థితిని చక్కదిద్దారు.  

ఇదీ చదవండి :     తిరుమలలో వైభవంగా అనంతపద్మనాభస్వామి వ్రతం

Last Updated :Sep 19, 2021, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.