ETV Bharat / state

'శ్రీవారి ఆర్జిత సేవలకు మార్చి నుంచి పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి'

author img

By

Published : Feb 5, 2021, 3:57 PM IST

19నుంచి తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తితిదే ఉన్నతాధికారులతో ఆలయ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆర్జిత సేవలకు మార్చి నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని తెలిపారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తిరుమాడవీధుల్లో రథసప్తమి వాహన సేవలు నిర్వహిస్తామన్నారు.

Superiors review
ఉన్నతాధికారుల సమీక్ష

తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలకు మార్చి నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే ఉన్నతాధికారులతో అన్నమయ్య భవన్‌లో ఆయన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. 19న నిర్వహించనున్న రథసప్తమి ఏర్పాట్లపై ఈవో జవహర్​రెడ్డితో కలసి చర్చించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తిరుమాడవీధుల్లో వాహన సేవలు జరుపుతామన్నారు. విశాఖ, అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాల్లో త్వరలోనే కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. 13న చెన్నైలో పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏకగ్రీవమైనట్లు ప్రకటించవద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.