ETV Bharat / state

రామకుప్పం ఎస్సైపై సస్పెన్షన్ వేటు.. ఎందుకంటే

author img

By

Published : May 19, 2022, 4:03 AM IST

Ramakuppam SI Shiva kumar Suspended: సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్‌ ఘటనలో చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్సై, ఓ కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నందున చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Ramakuppam SI venkata Sivakumar Suspend

చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్సై వెంకట శివకుమార్​పై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనలో ఎస్సైతోపాటు ఓ హెడ్​ కానిస్టేబుల్​​ సస్పెండ్ అయ్యారు. రామకుప్పం ఎస్సైగా పనిచేస్తున్న శివకుమార్​.. తన సర్వీస్​ రివాల్వర్​ పోగొట్టుకున్నారు. మూడు నెలల క్రితం రివాల్వర్‌ కనిపించకపోవడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే.. మిస్సైన రివాల్వర్​ను ఐదు రోజుల క్రితం పీఎస్‌లో సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ సదరు అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఎస్సై శివకుమార్​తోపాటు హెడ్​ కానిస్టేబుల్​ సుబ్రహ్మణ్యంపై సస్పెండ్​ చేశారు.

ఇదీ చదవండి: కోనసీమ జిల్లా పేరు మార్పునకు ప్రభుత్వ నిర్ణయం.. కొత్త పేరు ఏంటంటే !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.