ETV Bharat / state

'యువగళం సభను అడ్డుకున్నపోలీసులు' ఘటనలో.. లోకేశ్​ సహా ఇతర టీడీపీ నేతలపై కేసు నమోదు

author img

By

Published : Feb 4, 2023, 10:29 AM IST

Updated : Feb 4, 2023, 10:53 AM IST

CASE FILE ON NARA LOKESH AND TDP LEADERS : యువగళం నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. బంగారుపాళ్యం ఘటనలో లోకేశ్​ సహా.. పలువురు తెలుగుదేశం కార్యకర్తలపై వివధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

CASE FILE ON NARA LOKESH
CASE FILE ON NARA LOKESH

CASE FILE ON NARA LOKESH AND TDP LEADERS : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో.. యువగళం పాదయాత్ర సందర్భంగా.. శుక్రవారం చోటు చేసుకున్న ఘటనలపై.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి. లోకేశ్‌తో పాటు అమర్నాథ్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, పులివర్తి నానిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం నేతలు జయప్రకాశ్‌, జగదీష్‌పై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.

లోకేశ్ సహా పలువురిపై.. బంగారుపాళ్యం ఎస్సై మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇతర నేతలపై పలమనేరు సీఐ అశోక్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు వారిపై.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించారంటూ.. శుక్రవారం నాడు.. బంగారుపాళ్యంలో లోకేశ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.

బహిరంగసభ జరగకుండా పాదయాత్ర వాహనాలను సీజ్ చేశారు. అయితే లోకేశ్​ పక్కనే ఉన్న డాబా ఎక్కి ప్రజలతో మాట్లాడారు. పోలీసుల తీరును నిరసిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు .. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. కార్యకర్తలపై 353, 290,188, 341 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు..

TDP LEADER VARLA RAMAIAH LETTER TO DGP : బంగారుపాళ్యంలో ఘటనపై డీజీపీకి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. కొంతమంది పోలీసు అధికారులు అధికారపార్టీతో కుమ్మక్కై యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని.. ఆయన ఆరోపించారు. డీఎస్పీ సుధాకర్ రెడ్డి నాయకత్వంలో పోలీసులు యువగళం వాలంటీర్లను హింసిస్తున్నారన్నారు.

గజేంద్ర అనే యువగళం వాలంటీర్‌పై పలమనేరు ఇన్‌స్పెక్టర్‌ దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని.. రక్తపు గాయాలతో అతడు కిందపడిపోయాడని వర్ల తెలిపారు. అధికారపార్టీతో కుమ్మక్కై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా సీజ్ చేసిన యువగళం వాహనాలను రిలీజ్ చేయాలని వర్లరామయ్య డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 4, 2023, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.