ETV Bharat / state

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో గోడలు

author img

By

Published : Apr 27, 2020, 8:27 AM IST

Updated : Apr 27, 2020, 9:32 AM IST

కరోనా భయం గోడ కట్టించేసింది. రాకపోకలను నియంత్రించేందుకు ముళ్ల కంపలు వేయటం చూశాం. తమిళనాడు అధికారులు మరో అడుగు ముందుకేసి రోడ్డుకడ్డంగా గోడ కట్టేశారు. చిత్తూరు జిల్లా.. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో కడుతున్న గోడ నిర్మాణంపై చిత్తూరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

On Corona fear tamilnadu officers constructed wall across road
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో గోడలు

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో గోడలు

కరోనా కలవరంతో రహదారులకు అడ్డంగా మూడు చోట్ల గోడలు కట్టేశారు. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో చేపట్టిన ఈ నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నుంచి గుడియాత్తానికి వెళ్లే దారిలోనూ, చిత్తూరు-తిరుత్తణి మార్గంలో శెట్టింతంగాళ్‌ ప్రాంతంలోనూ, బొమ్మసముద్రం వద్ద జాతీయ రహదారిపై కూడా అడ్డంగా తమిళనాడు అధికారులు ఆదివారం సిమెంటు గోడలు కట్టించేశారు. ఈ విషయమై పలమనేరు తహసీల్దారు శ్రీనివాసులు మాట్లాడుతూ.. సరిహద్దులో గోడ నిర్మించడం సరికాదని.. సమస్యను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వేలూరు జిల్లా అధికారులతో రాష్ట్ర అధికారులు సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రంపై కరోనా పంజా.. 1100 చేరువలో కేసులు

Last Updated :Apr 27, 2020, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.