ETV Bharat / state

బీడీ కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటాం: లోకేశ్​

author img

By

Published : Feb 6, 2023, 2:01 PM IST

LOKESH PADAYATRA ON 11TH DAY
LOKESH PADAYATRA ON 11TH DAY

LOKESH YUVAGALAM PADAYATRA ON 11TH DAY: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. మహిళలు, కార్యకర్తలు లోకేశ్​ పాదయాత్రకు నీరాజనాలు పడుతున్నారు.

LOKESH PADAYATRA ON 11TH DAY : బీడీ కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటామని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లా ముంగసముద్రం నుంచి 11వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగించిన లోకేశ్‌..చిత్తూరు పట్టణంలో నడిచారు. దారిపొడవునా తనను కలిసిన వారితో సెల్ఫీలు దిగుతూ,.. ప్రజలకు అభివాదం చేస్తూ సాగిపోతున్నారు. సంతపేటలో లోకేశ్‌ను.. బీడీ కార్మికులు కలిశారు.

రేయింబవళ్లూ కష్టపడినా,. తమకు కనీస వేతనాలు అమలు కావడం లేదని కార్మికులు వాపోయారు. కార్మిక చట్టం ప్రకారం.. ESI, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. బీడీ కార్మికులకూ చంద్రన్న బీమా పథకం వర్తింపజేసివారి కుటుంబాలకు అండగా నిలుస్తామని, పక్కా గృహ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని లోకేశ్‌ భరోసా ఇచ్చారు. పాదయాత్రలో న్యాయవాదులు, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు లోకేశ్తో పాటు నడిచి.. వారి సమస్యలను లోకేశ్​కు వివరించారు. జగన్‍ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఇబ్బందులు తప్పడం లేదని... టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.