ETV Bharat / state

రూ.10 లక్షల విలువైన కొవిడ్ మందులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ

author img

By

Published : May 30, 2021, 5:32 PM IST

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత ఖర్చులతో కరోనా బాధితులకు మందులు పంపిణీ చేశారు. హోమ్ ఐసోలేషన్​లో ఉన్న వాళ్లకు ఈ కిట్లును స్థానిక తెదేపా కార్యకర్తల ద్వారా పంపిణీ చేస్తామని స్థానిక నాయకులు తెలిపారు.

కొవిడ్ మందులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
కొవిడ్ మందులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. రూ. 10 లక్షల విలువ చేసే కొవిడ్ కిట్లను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో కొవిడ్ బారినపడ్డ వాళ్లకు ఈ కిట్లు పంపిణీ చేశారు. హోమ్ ఐసోలేషన్​లో ఉన్నవాళ్లకు ఈ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని స్థానిక నాయకులు అన్నారు. బాలకృష్ణ ఇప్పటికీ రెండు దఫాలుగా రూ. 35 లక్షల విలువైన కొవిడ్ కిట్లను అందజేయగా.. మంచి ఫలితాలు ఉన్నాయని స్థానికులు అన్నారు. ఇప్పుడు మరో రూ. 10 లక్షల విలువైన కిట్లను పంపారని.. వాటిని తెదేపా కార్యకర్తలు ద్వారా హోమ్ ఐసోలేషన్​లో ఉన్నవాళ్లకు పంపిణీ చేస్తామన్నారు.

ఇదీ చదవండి..

Corona Virus: పసి మనసులపై పాడు వైరస్ పంజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.