ETV Bharat / state

ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వాలి

author img

By

Published : Mar 17, 2021, 12:38 PM IST

జాతీయ జల్ జీవన్ మిషన్ బృందం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వాలన్నదే.. ఈ మిషన్ లక్ష్యమని కమిటీ సభ్యులు తెలిపారు.

jal jeevan mission team visit to chittor
ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వాలి


ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వాలన్నదే జాతీయ జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ఉద్దేశమని ఆ కమిటీ సభ్యులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన జల్ జీవన్ మిషన్ బృందం.. జిల్లా కలెక్టర్ హరినారాయణన్​ను కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం చిత్తూరులో తాగునీటి నాణ్యత పరీక్ష ప్రయోగశాలను తనిఖీ చేశారు. వెదురుకుప్పం, పుత్తూరులలో పర్యటించి మంచి నీటి కుళాయి కనెక్షన్​లను పరిశీలించారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా గ్రామాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కమిటీ సభ్యులు సూచించారు. ఓవర్ హెడ్ ట్యాంకులు కావాలంటే మంజూరు చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

డయాఫ్రం వాల్ దెబ్బతిన్నచోట సత్వర మరమ్మతులు: మంత్రి అనిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.