ETV Bharat / state

ఆమె కరోనాను జయించింది.. కానీ..!

author img

By

Published : May 6, 2020, 12:06 PM IST

ఒకవైపు కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాల్ని బలిగొంటుంటే.. మరోవైపు వ్యాధి బారిన పడి కోలుకున్న వారి మనసులను సాటి మనుషులే చంపేస్తున్నారు. విధి నిర్వహణలో కొవిడ్ బారిన పడి, అనంతరం కోలుకున్న మహిళను యజమాని ఇంట్లోకి రానివ్వని ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది.

house owner does not allow to female employee who was corona effected at srikalahasti chittore district
ఆమె కరోనాను జయించింది.. కానీ..!

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ అటెండరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు కరోనా సోకగా.. క్వారంటైన్​కు తరలించారు. చికిత్స అనంతరం ఆమె పూర్తిగా కోలుకుని ఆనందంగా ఇంటికి వెళ్లారు. అయితే... ఆ ఇంటి యజమాని ఆమెను లోపలికి రానివ్వలేదు. వైరస్ బారిన పడిన ఆమె ఇంట్లోకి రావడానికి వీల్లేదన్నారు.

విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఆ మహిళకు మరొక చోట బస ఏర్పాటు చేశారు. కరోనా బారిన పడి కోలుకున్న వారి విషయంలో వెలి వేసినట్టుగా ప్రవర్తించవద్దని ప్రభుత్వం, ఉన్నతాధికారులు, వైద్యులు కోరుతూనే ఉన్నారు. వారికి బాసటగా నిలవాలని చెబుతున్నారు. అయినా.. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం.

ఇవీ చదవండి:

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: 'మద్యం' విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.