ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో భారీవర్షాలు..పొంగుతున్న వాగులు

author img

By

Published : Nov 27, 2020, 6:32 PM IST

Updated : Nov 27, 2020, 8:36 PM IST

నివర్ తుపాను ప్రభావం వల్ల చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వంతెనలు కొట్టుకపోయాయి. రాళ్ల వాగులో గల్లంతైన రైతు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

heavy rain in chittore due to nivar cyclone
చిత్తూరు భారీవర్షాలు

చిత్తూరు జిల్లాలో భారీవర్షాలు

రేణిగుంటలో

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని కుమ్మరపల్లె వద్ద రాళ్ల వాగులో గల్లంతైన రైతు ప్రసాద్ మృతదేహం లభ్యమైంది. రెండో రోజున అధికారులు, పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలలో గ్రామానికి సమీపంలో రైతు ప్రసాద్ మృతదేహం దొరికింది. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రసాద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

పుత్తూరులో
పుత్తూరు మున్సిపాలిటీలో నివర్ తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతల్లో నగరి తెదేపా నేత గాలి భాను ప్రకాష్ పర్యటించారు. పుత్తూరు మున్సిపాలిటీలోని గేటు, పుత్తూరు భవాని నగర్, రాజీవ్ నగర్ తదితర కాలనీలలో బాధితులను పరామర్శించారు. చిన్న తొర్రూర్ వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందువల్ల.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన నేసానూరు, పైడిపల్లి తోరూరు గ్రామస్థులతో ఫోన్​లో మాట్లాడారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

పుంగనూరులో

నివర్ తుపాను ప్రభావం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గం సొదుం సమీపంలో గార్గేయనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి నది పై నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. 83 సంవత్సరాల చరిత్ర కలిగిన వంతెన కొట్టుకుపోవటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. తిరుపతి -పుంగనూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి...

సత్యవేడులో

సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూర్​లోని ఆరణీయర్ సాగునీటి జలాశయం నుంచి నీటిని అధికారులు విడుదల చేశారు. పిచ్చాటూరు ఆరణీయర్ జలాశయానికి ఎగువప్రాంతం నుంచి 7 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా 7600 క్యూసెక్కుల నీటిని 4 గేట్లద్వారా బయటకు దిగువకు విడుదల చేస్తున్నారు. 29 అడుగుల నీటిమట్టం ఉండగా... మిగిలిన నీటిని బయటకు పంపుతున్నారు.

ఇదీ చూడండి.

కడపలో బుగ్గవంకకు భారీగా వరదనీరు.. సహాయక చర్యల్లో ఎస్పీ..

Last Updated :Nov 27, 2020, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.