ETV Bharat / state

శేషాచలం అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు

author img

By

Published : Mar 28, 2021, 5:12 AM IST

Updated : Mar 28, 2021, 10:57 AM IST

చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతున్నాయి. గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో మంటలు భారీగా వ్యాపిస్తున్నాయి. అదుపులోకి తెచ్చేందుకు అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

fire accident at sheshachalam forest
శేషాచల అటవీలో చేలరేగిన మంటలు

చిత్తూరు జిల్లా శేషాచల అటవీప్రాంతంలోని తలకోన సెంట్రల్ బీట్ పరిధిలో గల ఉట్లదింపదడి, నెలకోన, నక్కలవంక, బొబ్బిలిరాజు మిట్ట ప్రాంతాల్లో మంటలు చేలరేగాయి. ఉదయం నుంచి స్ట్రకింగ్ ఫోర్, బ్యేస్ క్యాంపు, సీబీటీ, ఫారెస్ట్ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పశువుల కాపరులు నిప్పు పెట్టి ఉంటారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

చంద్రగిరి కోట సమీపంలోని కొండలు, కొటాల ప్రాంతాల్లో కూడా మంటలు చేలరేగగా.. ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలు ఇలాగే కొనసాగితే శేషాచలంలోని అరుదైన జంతు సంపదను, విలువైన ఎర్రచందనం చెట్లు కాలి బూడిదయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. సమీప ప్రాంతంలోని పంటపొలాలు కాలి బుడదయ్యే అవకాశం ఉందని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి

ఆలయంలో నగదు, వస్తువులు చోరీ కాలేదు: తితిదే

Last Updated : Mar 28, 2021, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.