ETV Bharat / state

విస్తరణలో భూమి పోయింది... పరిహారం దిక్కులేదు..!

author img

By

Published : Dec 4, 2019, 4:59 PM IST

farmers problems after giving land to tirupathi airport
తిరుపతి విమానాశ్రయానికి భూమిచ్చిన రైతుల కష్టాలు

రేణిగుంట విమానాశ్రయ విస్తరణలో పొలాలు కోల్పోయిన రైతులకు... దశాబ్ధం గడచినా పరిహారం అందలేదు. సాగుచేసుకోవడానికి భూములు లేక... పరిహారం అందక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బడుగు రైతులు... ఉపాధి కోసం పట్టణానికి వలసపోతున్నారు. కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగినా... పరిహారం అందడం లేదు. అధికారులు మారుతున్నారు గానీ తలరాతలు మారలేదంటూ... రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విస్తరణలో భూమి పోయింది... పరిహారం దిక్కులేదు..!

అధ్యాత్మికంగా... పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ... యాత్రికుల రద్దీ పెరుగుతున్నందు రేణిగుంట విమానాశ్రయ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2009లో పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములను సేకరించారు. రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలో దాదాపు 800 ఎకరాల భూమిని సేకరించారు.

సేకరించిన భూములకు పరిహారం చెల్లించలేదు. రైతులు విమానాశ్రయ విస్తరణను అడ్డుకున్నారు. ప్రభుత్వం స్పందించి ఎకరాకు 5 లక్షల 20 వేల చొప్పున... విడతల వారీగా 710 ఎకరాలకు పరిహారం చెల్లించి నిర్మాణాలు పూర్తిచేసింది. వికృతమాల గ్రామపంచాయతీతోపాటు సమీపంలోని మరో 3 గ్రామాల్లో 50 మంది రైతులకు పరిహారం చెల్లించలేదు. పదేళ్లుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టు తిరిగినా పరిహారం చెల్లించలేదని వాపోతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో... విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల ఏర్పాటుకు భారీగా భూములు సేకరించింది. ఆ భూమికి పరిహారం చెల్లించిన రెవెన్యూ అధికారులు... విమానాశ్రయానికి సేకరించిన భూములకు మాత్రం చెల్లించలేదు. ఒక సర్వేనెంబర్‌లోని సగం భూమికి పారిశ్రామిక అవసరాల సేకరణలో పరిహారం పొందిన రైతులు... అదే సర్వేనెంబర్‌లో విమానాశ్రయం కోసం సేకరించిన మిగిలిన భూమికి పరిహారం దక్కలేదని చెబుతున్నారు.

అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఉన్న భూములు కోల్పోయి... పరిహారం అందక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి

భార్యపై స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం

REPORTER: V.NARAYANAPPA. CAMERA: SUDHAKAR CENTER: TIRUPATI FILE: AP_TPT_09_26_AIRPORT_LAND_NO_PARIHARAM_PKG_3038178 () రేణిగుంట విమానాశ్రయ విస్తరణలో పొలాలు కోల్పోయిన రైతులకు...దశాబ్ధం గడచినా పరిహారం అందడం లేదు. దీంతో సాగుచేసుకోవడానికి భూములు లేక...పరిహారం సొమ్ము అందక రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఉన్న కొద్దిపాటి పొలంలో పంటలు పండించుకొంటూ జీవనం సాగించిన బడుగురైతులు...ఉపాధి కోసం పట్టణానికి వలసపోతున్నారు. కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగినా పరిహారం అందడం లేదని....అధికారులు మారడం తప్ప మా తలరాతలు మారలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం అందక...సాగుచేసుకోవడానికి పొలాలు లేక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న రైతులపై ఈటీవీ ప్రత్యేక కథనం ఇపుడు...LOOK VO1: అధ్యాత్మికంగా...పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ యాత్రికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2009 సంవత్సరంలో పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములను సేకరించారు. రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలో దాదాపు ఎనిమిది వందల ఎకరాలకు పైబడి భూమిని సేకరించారు. విమానాశ్రయం సమీపంలోని ఏర్పేడు మండలం వికృతమాల, గోవిందవరం, పాపానాయుడుపేట, సుబ్బయ్యగుంట, రేణిగుంట మండలంలోని గుత్తివారిపల్లె, వెదల్లచెరువు ప్రాంతాలకు చెందిన 500 మంది రైతుల నుంచి భూములు సేకరించారు. సేకరించిన భూములకు పరిహారం చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టిన రైతులు విమానాశ్రయ విస్తరణను అడ్డుకొన్నారు. స్పందించిన ప్రభుత్వం ఎకరాలకు ఐదులక్షల ఇరవైవేల రూపాయల చొప్పున విడతల వారీగా 710 ఎకరాలకు పరిహారం చెల్లించి నిర్మాణాలను పూర్తి చేసింది. వికృతమాల గ్రామ పంచాయతీతో పాటు సమీపంలోని మరో మూడు గ్రామాల్లో 50 మంది రైతులకు పరిహారం చెల్లించలేదు. గడచిన పది సంవత్సరాలుగా ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టు తిరిగినా పరిహారం చెల్లించడం లేదని వాపోతున్నారు. పరిహారం అందక...సాగుచేసుకోవడానికి భూములు లేక జీవనోపాధి కోల్పోయామని వాపోతున్నారు....BYTES బాధిత రైతులు VO2: విమనాశ్రయ విస్తరణతో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపులో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల ఏర్పాటుకు భారీగా భూములు సేకరించింది. పారిశ్రామిక అవసరాల కోసం సేకరించిన భూమికి పరిహారం చెల్లించిన రెవెన్యూ అధికారులు.... విమానాశ్రయానికి సేకరించిన భూములకు మాత్రం చెల్లించ లేదు. ఒక సర్వేనెంబర్‌లోని సగం భూమికి పారిశ్రామిక అవసరాల సేకరణ రూపంలో పరిహారం పొందిన రైతులు అదే సర్వేనెంబర్‌లో విమానాశ్రయం కోసం సేకరించిన మిగిలిన భూమికి పరిహారం దక్కలేదు. రెవెన్యూ అధికారులు ఒకే భూమికి పరిహారం చెల్లింపులో భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....BYTES బాధిత రైతులు. VO3:అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో....పారశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఉన్న భూములు కోల్పోయి....పరిహారం అందక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు....END PTC
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.