ETV Bharat / state

భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి: సీపీఐ నారాయణ

author img

By

Published : May 1, 2021, 10:03 PM IST

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం.. దేశ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమని.. ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని.. ఇదే సమయంలో భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

cpi narayana
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. మారుతున్న పరిణామాలను కమ్యూనిస్టు పార్టీ నిశితంగా పరిశీలిస్తోందని.. భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో సైతం వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయన్నారు. మేడే సందర్భంగా చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ కేంద్రంలో ఏఐటీయూసీ జెండాను నారాయణ ఆవిష్కరించారు. కరోనా కట్టడిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోవడం ఖాయమని అన్నారు.

సరిపడా ఆసుపత్రులు లేక అవస్థలు..

దేశంలో కొవిడ్ పేషెంట్లకు సరిపడా ఆసుపత్రులు లేక ఒక్కో స్ట్రెచర్​పై ఇద్దరు రోగులు పడుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కేసులు పెరుగుతుంటే కుంభమేళా ఉత్సవాలు నిర్వహించిన ఘనత ఒక్క మోదీకే దక్కుతుందని విమర్శించారు.

హక్కులు, చట్టాల సంరక్షణ కోసం పోరాటాలకు సిద్ధం కావాలి..

నాడు పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటని మండిపడ్డారు. మేడేని స్ఫుర్తిగా తీసుకొని కార్మికులు హక్కులు, చట్టాల సంరక్షణ కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మురళి, నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండం, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: చింతా మోహన్

'కరోనాపై నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్రం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.