ETV Bharat / state

తిరుపతిలో సంపూర్ణ మద్యనిషేధం: తితిదే

author img

By

Published : Oct 24, 2019, 5:47 AM IST

తిరుపతిలో సంపూర్ణ మద్యనిషేధం: తితిదే

తిరుపతిలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని పాలక మండలి తీర్మానం చేసిందని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

స్విమ్స్ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం

స్విమ్స్‌ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో తితిదే ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోర్డు తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మార్పులు, చేర్పులతో గరుడ వారధిని పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు.

సంపూర్ణ మద్యపాన నిషేధానికి పాలక మండలి తీర్మానం

తిరుపతిలో మద్యపాన నిషేధంపై చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఎంపిక చేసిన శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులకు ‘బ్రహ్మోత్సవ బహుమానం’ అందిస్తామన్నారు. దీనిలో భాగంగా శాశ్వత ఉద్యోగులకు రూ.14వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,850 ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. తిరుమలలో మూడు నెలల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని తీర్మానించినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

శ్రీవారి భక్తిధామం

తితిదే పరిధిలోని 162 మంది అటవీ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయించామన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుపతిలో ‘శ్రీవారి భక్తిధామం’ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భక్తులు దర్శనానికి వెళ్లేవరకు నిరీక్షించకుండా శ్రీవారి భక్తిధామంలో గడిపేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తున్నామన్నారు. అక్కడ భక్తి ప్రవచనాలు, యోగా, లేజర్‌ షోలతో పాటు చిన్నారుల్లోనూ భక్తిభావం పెంపొందించే ఏర్పాట్లు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

ఇవీ చదవండి

"సంక్రాంతి తర్వాత తిరుమలలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం"

Intro:ap_tpg_81_23_nelavalinapanta_ab_ap10162


Body: అల్ప పీడనం ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్సాలకు వరి పంట నేల వాలింది. మండలంలో 7,484 హెక్టార్లలో వరి సాగు చేశారు. ఇందులో సుమారు 100 ఎకరాలలో వరి నేలవాలింది. పలు చోట్ల నీరు పంటపై నుంచి ప్రవహిస్తుంది. ఈత, పాలు పోసుకునే దశలో పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా స్వర్ణ రకం వరి పడిపోయింది.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.