ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@7am

author img

By

Published : Dec 17, 2022, 6:59 AM IST

..

7am topnews
ప్రధానవార్తలు7am

  • మాచర్లలో ఉద్రిక్తత.. తెదేపా కార్యాలయం, వాహనాలకు నిప్పుపెట్టిన వైసీపీ శ్రేణులు
    పల్నాడు జిల్లాలోని మాచర్ల రణరంగంగా మారింది. టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడులు చేశారు. మాచర్లలో శుక్రవారం సాయంత్రం ‘ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ కార్యకర్తలు స్థానిక రింగురోడ్డు నుంచి ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు కూడా భారీగా మోహరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'విజన్‌-2020' కల సాకారం.. నెక్ట్స్‌ టార్గెట్‌ 2029: టీడీపీ అధినేత చంద్రబాబు
    TDP chief Chandrababu Naidu: హైదరాబాద్‌లో ఐఎస్‌బీ 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను చంద్రబాబు.. ఐఎస్‌బీ విద్యార్థులతో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తీరు మార్చుకోకపోతే టిక్కెట్లు కష్టమే.. ఆ ఎమ్మెల్యేలకు సీఎం జగన్​ హెచ్చరిక
    JAGAN WARNING TO MLAs: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదికను సీఎం జగన్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమం నిర్వహణలో 32 మంది ఎమ్మెల్యేలు వెనకబడినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం జగన్‌ సమావేశమై కార్యక్రమం అమలు తీరుపై చర్చించారు. ఒకవేళ ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కృష్ణా జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు మృతి, ముగ్గురు విద్యార్థులు గల్లంతు
    కృష్ణాజిల్లాలోని యలమంచిలి వద్ద కృష్ణానదిలో ఈతకు దిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురి కోసం పోలీసులు, సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. నదిలో మునిగిపోతున్న మరో ఇద్దరు విద్యార్థులను స్థానికులు రక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బంగాల్​ చాయ్​​వాలా హంగామా.. ఇంటికి అర్జెంటీనా రంగులు.. బయట మెస్సీ విగ్రహం
    ఫిపా వరల్డ్​ కప్​ ఫీవర్​ ప్రపంచంతో పాటు భారత్​ను ఉర్రూతలూగిస్తోంది. బంగాల్​కు చెందిన ఓ చాయ్​ వాలా.. అర్జెంటీనా ఫుట్​బాల్​ ఆటగాడు మెస్సీ తన సోదరుడు అంటున్నాడు. ఇంటికి అర్జెంటీనా జెండా రంగులు వేయించుకున్నాడు. అతడి కథేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐదేళ్ల చిన్నారి నేత్రదానం.. ఆగ్రాలో యంగెస్ట్​ డోనర్​గా నిలిచి..
    ఓ ఐదేళ్ల బాలిక చనిపోతూ మరొకరి జీవితంలో వెలుగులు నింపింది. చనిపోయిన ఆ చిన్నారి నేత్రాలను ఆమె తల్లిదండ్రులు దానం చేశారు. దీంతో ఆ చిన్నారి ఆగ్రాలో ఈ ఏడాది నేత్రదానం చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రపంచవ్యాప్తంగా 'కలరా' కలవరం.. వ్యాక్సిన్ కొరతపై WHO ఆందోళన
    ప్రపంచవ్యాప్తంగా కలరా వ్యాధి వ్యాప్తి అధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రతిఏటా సాధారణ కేసులతో పోలిస్తే ఈ ఏడాది వ్యాధి వ్యాప్తి మూడు రెట్లు అధికంగా ఉందని తెలిపింది. ఇదే సమయంలో కలరా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడటంపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొత్తగా మదుపు చేద్దామనుకుంటున్నారా?.. ఈ విషయాలు మీకోసమే!
    స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకుంటున్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం ఛాయలున్నప్పటికీ.. మన దేశంపై ఆ ప్రభావం పెద్దగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్న వారు మ్యూచువల్‌ ఫండ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ దశలో ఆర్థిక లక్ష్యాల సాధనకు మదుపు చేసేటప్పుడు కొన్ని అంశాలను పరిశీలించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రంజీ ట్రోఫీ.. 18 ఓవర్లలో 25 పరుగులకే నాగాలాండ్ ఆలౌట్​..
    Ranji Trophy: రంజీ ట్రోఫీలో అతి తక్కువ స్కోర్​ నమోదైంది. ఉత్తరాఖండ్​తో జరిగిన మ్యాచ్​లో రెండో ఇన్నింగ్స్​లో 18 ఓవర్లలో 25 పరుగుల వద్ద నాగాలాండ్​ ఆలౌట్​ అయ్యింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఎవరినీ తక్కువ చేసి మాట్లాడను.. అసలు 'వారిసు' విజయ్​తో చేయాల్సింది కాదు..'
    ఇటీవల విజయ్​, అజిత్​ గురించి తాను చేసిన వ్యాఖ్యల పట్ల ప్రముఖ నిర్మాత దిల్​ రాజు స్పందించారు. తాను ఎవరినీ తక్కువ చేసిన మాట్లాడను అని అన్నారు. అసలు 'వారిసు' సినిమా.. విజయ్​తో చేయాల్సింది కాదని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.