ETV Bharat / state

సమస్యల గళమెత్తుతున్న యువత.. భరోసా కల్పిస్తున్న లోకేశ్

author img

By

Published : Feb 8, 2023, 9:09 PM IST

Yuvagalam 13th day : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. 13వ రోజు యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో లోకేశ్ పర్యటించారు. గ్రామాల్లో మహిళలు ఆయనకు హారతులు పట్టి స్వాగతించారు. పాదయాత్రలో యువత పెద్ద ఎత్తున పాల్గొంటోంది. కృష్ణాపురంలో యువతతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని, ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని, ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయించాలని విద్యార్థులు కోరారు. ఎన్ ఆర్ పేటలోని ఎన్టీఆర్ కూడలిలో లోకేశ్‌ మాట్లాడుతుండగా.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడం కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

సమస్యల గళమెత్తుతున్న యువత.. భరోసా కల్పిస్తున్న లోకేశ్

Yuvagalam 13th day : రాష్ట్రానికి జగన్‌ చేసిన నష్టం.. దశాబ్దం తర్వాత అనుభవంలోకి వస్తుందని లోకేశ్‌ విమర్శించారు. 13వ రోజు పాదయాత్రలో వివిధ వర్గాలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ ఆర్ పేటలోని ఎన్టీఆర్ కూడలిలో లోకేశ్‌ మాట్లాడుతుండగా.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడం కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రజలను పలకరిస్తూ, వారితో మాట్లాడుతూ.. సమస్యలు తెలుసుకుంటూ 13వరోజూ లోకేశ్‌ యువగళం పాదయాత్ర కొనసాగింది.

మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా దిగువమాసపల్లెలో బస చేసిన లోకేశ్‌ ఈ ఉదయం.. ఈ గ్రామంలోనే బీసీ వర్గాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను విన్న లోకేశ్‌.. అధికారంలోకి రాగానే పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత యాత్రను కొనసాగించగా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. దారిపొడవునా ఎదురొచ్చే గ్రామాల్లో మహిళలు హారతులు పట్టి లోకేశ్​ను స్వాగతించారు.

యువతకు భరోసా... పాదయాత్రలో భాగంగా చిత్తూరు గ్రామీణ మండలం కృష్ణాపురం చేరుకొన్న లోకేశ్​ యువతతో ముఖామూఖి నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఏ నోటిఫికేషన్ విడుదల చేయలేదని... చిత్తూరు జిల్లాకు విశ్వవిద్యాలయం లేదని విద్యార్థులు లోకేశ్​కు వివరించారు. పీజు రీయింబర్స్​మెంటు సరిగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రాత్రి ఏ ఆత్మతో మాట్లాడుతారో గానీ ఉదయం లేచి విచిత్ర నిర్ణయాలు తీసుకొంటారని లోకేశ్‍ ఎద్దేవా చేశారు. యువతీయువకులు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేందుకే యువగళం వేదిక ఏర్పాటు చేశామన్నారు. సభలకు అనుమతి ఇవ్వడానికి విచిత్రమైన ఆంక్షలు విధించి.. ప్రజాగొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక చిత్తూరులో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే సచివాలయ ఉద్యోగులను తొలగిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని.. సచివాలయ ఉద్యోగుల విధులను స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఇండస్ట్రీని డెవలప్​మెంట్​ చేయాలన్నది మా ఉద్దేశం అని లోకేశ్ తెలిపారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం కూడా తీసుకురావడంతో పాటు వాటికి ఇన్సూరెన్స్​ కూడా చేయిస్తాం.. ఆదరణ పథకం మళ్లీ తీసుకువస్తామని లోకేశ్ భరోసా కల్పించారు.

తిరిగి యాత్ర కొనసాగించిన లోకేశ్‌.. ఎన్.ఆర్.పేటలోని ఎన్టీఆర్ కూడలిలో సదస్సులో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోబోగా... తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాసేపటికి లోకేశ్‌ ప్రసంగం పూర్తి చేసి మళ్లీ నడక ప్రారంభించడంతో.. పరిస్థితి సద్దుమణిగింది.

చిత్తూరు నియోజకవర్గంలో ప్రారంభమెన పాదయాత్ర జీడీ నెల్లూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. రాత్రికి ఆత్మకూరు గ్రామంలోని ముత్యాలమ్మ గుడి సమీపంలోని విడిది కేంద్రంలో బస చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.