ETV Bharat / state

మరోసారి చర్చలోకి వైఎస్సార్​ పేరు.. ఈసారి ఏకంగా కోడిగుడ్లపైనే

author img

By

Published : Dec 23, 2022, 4:31 PM IST

YSR STAMP ON EGGS
YSR STAMP ON EGGS

YSR STAMP ON EGGS: బాలింతలు, అంగన్వాడీలో చిన్నారులు, పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కోడిగుడ్లను పంపిణీ చేస్తుంది. అయితే సహజంగా ఆ కోడిగుడ్లు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం స్టాంపులు వేస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోడిగుడ్లపై వైఎస్సార్​ స్టాంప్​ వేసి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.

YSR STAMP ON EGGS : పాఠశాలల్లో విద్యార్థులకు అందించే కోడిగుడ్డుపై వివిధ రకాల స్టాంపులు వేస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన కోడిగుడ్లపై వైఎస్సార్​ ఎస్పీ అని స్టాంప్ వేశారు. మామూలుగా బాలింతలు, చిన్నారులు, విద్యార్థులకు పంపిణీ చేసే గుడ్లకు.. మార్కెట్లో దొరికే వాటికి తేడా తెలిసేందుకు, అవి దుర్వినియోగం కాకుండా స్టాంపు వేస్తారు. అయితే ప్రభుత్వం మాత్రం మరి కొంచెం ఆలోచించి.. వైఎస్సార్​ ఎస్పీ పేరుతో ఉన్న గుడ్లను విద్యార్థులకు అందించారు. వైఎస్సార్ తాత పేరు కూడా గుర్తించుకోవాలని జగన్ మామ ఈ కోడిగుడ్లు ఇచ్చారేమో అని పిల్లలు అనుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.