ETV Bharat / state

యువకుడిపై ఎస్​ఐ దాష్టీకం..తలపై జుట్టును కోసేసి..

author img

By

Published : Jul 7, 2022, 7:00 AM IST

యువకుడిపై ఎస్​ఐ దాష్టీకం
యువకుడిపై ఎస్​ఐ దాష్టీకం

బాపట్ల జిల్లా వేమూరు ఎస్సై అనిల్ ఓ యువకుడిపై దాష్టీకం ప్రదర్శించాడు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడిని స్టేషన్​కు పిలిపించి విచక్షణారహితంగా చితకబాదాడు. తలపై కత్తితో దాడి చేయటంతో సదరు యువకుడికి తీవ్రగాయామైంది. కుమారుడి గాయం చూసి స్టేషన్​లోనే అతని తల్లి సృహతప్పి పడిపోయింది. ఆమె తలకు గాయం కావటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

యువకుడిపై ఎస్​ఐ దాష్టీకం

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం పరిధిలో రెండు వర్గాల యువకుల మధ్య జరిగిన గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరింది. షేక్ మహమ్మద్ రఫీ అనే 19 ఏళ్ల యువకుడిపై ఫిర్యాదు వచ్చిందని ఎస్​ఐ అనిల్ కుమార్ అతడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్​కి వచ్చి సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామ పెద్దలతో కలిసి కుటుంబ సభ్యులు రఫీని స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఎస్సై అనిల్ కుమార్ తనపై దాడి చేసినట్లు రఫీ ఆరోపిస్తున్నాడు.

"ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి ఎస్​ఐ విచాక్షణారహితంగా చితకబాదాడు. గదిలోకి తీసుకువెళ్లి వీపుపై కొట్టాడు. పలుమార్లు తలను గోడకేసి బాదాడు. నా తలపై ఉన్న జుట్టును కత్తితో కోశాడు. సరిగా తెగలేదని మళ్లీ రెండోసారి గట్టిగా కోయడంతోపై చర్మం సహా లేచి రావటంతో తీవ్ర రక్తస్రావంమైంది. బయటికి వెళ్లడానికి ప్రయత్నించగా వెళ్లడానికి వీల్లేదని.. డాక్టర్ స్టేషన్​కు వచ్చి వైద్యం చేసే వరకు ఇక్కడే ఉండాలని హుకుం జారీ చేశాడు. కానీ భయం వేసి ఒక్కసారిగా బయటికి పరుగుతీసి కుటుంబ సభ్యులు వద్దకు చేరుకున్నా." అని బాధితుడు రఫీ ఆరోపించాడు.

రక్తమోడుతున్న కుమారుడిని చూసి రఫీ తల్లి స్టేషన్ ఆవరణలోనే సృహతప్పి పడిపోయింది. ఆమె తలకు గాయకావటంతో రఫీతో పాటు ఆమెను తెనాలి ఆసుపత్రికి తరలించారు. రఫీ తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.