ETV Bharat / state

Today Road Accidents in AP: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. బైక్​ను ఢీకొన్న లారీ... నలుగురు మృతి.. పలువురికి గాయాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 12:07 PM IST

Today Road Accidents in AP: బాపట్ల జిల్లా సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరోవైపు పల్నాడు జిల్లాలో లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.

Today_Road_Accidents_in_AP
Today_Road_Accidents_in_AP

Today Road Accidents in AP : ఆగి ఉన్న లారీని కారు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన బాపట్ల జిల్లా సమీపంలో చోటు చేసుకుంది. పూర్తి వివరరాల్లోకి వెళితే.. నెల్లూరు నుండి గుంటూరు వెళుతున్న కారు.. మార్టూరు - చిలకలూరిపేట మధ్య జాతీయ రహదారిపై మార్టూరు సమీపంలో ఆగి ఉన్న బాతుల లారీని బలంగా ఢీ కొట్టింది. ప్రమాదం లో బ్రహ్మారెడ్డి(59), మల్లికార్జున రెడ్డి(50) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుంటూరు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Wedding party vehicle Accident : వివాహ వేడుకలో విషాదం.. కొండ దిగుతుండగా... అదుపుతప్పిన వాహనం

Two Killed in Lorry Collision With Two Wheeler : లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి బైపాస్ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. న్యూ వెల్లంపల్లికి చెందిన పోతురాజు వెంకటేశ్వర్లు చిన్న కుమార్తె హర్షితకు టైఫాయిడ్ జ్వరం సోకింది. దీంతో చిన్నారికి ఆర్ఎంపీ దగ్గర ఇంజక్షన్లు చేయించటానికి బ్రాహ్మణపల్లికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.. ఈ క్రమంలో పెద్ద కుమార్తె లక్ష్మీ తేజస్విని (6) కూడా వస్తానని అనటంతో ఇద్దరు కుమార్తెలను ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లగానే అదే గ్రామా నీకి చెందిన కారుకుల్ల సంపూర్ణ (49) పొలానికి వెళ్లటానికి బయలు దేరగా.. ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు.

Road Crossing Problems in Vijayawada: జాతీయ రహదారిపై వాహనాల రద్దీ.. నిత్యకృత్యమైన ప్రమాదాలకు అడ్డుకట్టేది..?

బ్రాహ్మణ పల్లి బైపాస్ రోడ్డు దగ్గరకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సంపూర్ణ, లక్ష్మీ తేజస్విని అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు కాగా హర్షితకు స్పల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన నర సరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్సై పి.రబ్బానీ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసు కొని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పంచనామా కోసం గురజాల ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు. సంపూర్ణకు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Three Injured in RTC Bus Overturn Accident : ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం గౌనిపల్లి వద్ద చోటు చేసుకుంది. కదిరి నుంచి హిందూపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు గౌనుపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోనికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ రాజేశ్వరి, నల్లమాడ మండలం సుబ్బరాయుని పల్లికి చెందిన మోహన్, గోరంట్ల వాసి రమణమ్మ గాయపడ్డారు.

ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు బాధితులను 108 వాహనం సాయంతో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన రమణమ్మను మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. ఓబుల దేవర చెరువు పోలీసులు కేసు నమోదు చేశారు. కదిరి హిందూపురం ప్రధాన రహదారి అధ్వానంగా అధ్వానంగా మారడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అన్నారు.

Lorry Accident in Prakasam District : రోడ్డు పక్కన టీస్టాల్​ లోకి దూసుకొచ్చిన లారీ.. ఆ సమయంలో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.