ETV Bharat / state

సీఎం పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు.. అవస్థలు పడిన విద్యార్థులు, తల్లిదండ్రులు

author img

By

Published : Dec 21, 2022, 9:06 PM IST

Students Problems in CM Meeting: బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. చుండూరు మండలం యడ్లపల్లిలో సీఎం పర్యటన కోసం తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుంచి భారీగా విద్యార్థులను తరలించారు. కాగా యడ్లపల్లి వెళ్లేందుకు ఒకే వరుస రహదారి ఉండటంతో వాహనాల్ని ఊరికి 2కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ చేశారు. పిల్లలు అక్కడి నుంచి నడుచుకుంటూ సభకు వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలోనూ ఎండలోనే నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

CM tour
ముఖ్యమంత్రి పర్యటన

Students Problems in CM Meeting: బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. చుండూరు మండలం యడ్లపల్లిలో సీఎం పర్యటన కోసం తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుంచి భారీగా విద్యార్థులను తరలించారు. అయితే యడ్లపల్లి వెళ్లేందుకు ఒకే వరుస రహదారి ఉండటంతో వాహనాల్ని ఊరికి 2కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ చేశారు. పిల్లలు అక్కడి నుంచి నడుచుకుంటూ సభకు వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలోనూ ఎండలోనే నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. మార్గమధ్యలో కనీసం మంచినీటి వసతి కూడా కల్పించలేదని విద్యార్థులు వాపోయారు. రోడ్డుపైకి వచ్చిన బస్సులు, పిల్లలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అలాగే యడ్లపల్లి దాటిన తర్వాత పార్కింగ్ ప్రాంతం వద్ద కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకేసారి అందరూ రావడంతో తమ ఎక్కి వచ్చిన వాహనాలు ఎక్కడ ఉన్నాయో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులన్నీ ఒకేసారి రోడ్డెక్కడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ముఖ్యమంత్రి పర్యటనలో ఇబ్బందులు పడ్డ విద్యార్థులు వారి తల్లిదండ్రులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.