'అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారూ.. ముసలోళ్ల పింఛన్ ముట్టొద్దు సారూ..'

author img

By

Published : Jan 14, 2023, 1:26 PM IST

old lady Ramulamma for pension

Old Woman Pension Problem: 92ఏళ్ల ఆ వృద్ధురాలు.. మూడు రోజులుగా భోజనం మానేసింది. అనారోగ్యం అందుకు కారణం కాదు. పైగా, కుటుంబ సభ్యులు కూడా తనను విసుక్కోలేదు.. ఏమీ అనలేదు. భర్త లేకున్నా.. 30 ఏళ్ల పాటు ఏ ఒక్కరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవిస్తున్న తన పింఛన్ డబ్బులను ప్రభుత్వం నిలిపివేయడమే వృద్ధురాలి మనోవేదనకు కారణం.

Old Woman Pension Problem: ఆమె భర్త 30 ఏండ్ల కిందట మృతి చెందాడు. అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. వితంతు పింఛన్ మంజూరు చేయడంతో ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బతుకుతూ కాలం వెళ్లదీస్తోంది. కాగా, ఓ అల్లుడికి ఔట్ సోర్సింగ్ జాబ్ ఉందన్న నెపంతో వైఎస్సార్ ప్రభుత్వం.. పింఛన్ తొలగించింది. దాంతో ఆ వృద్ధురాలు ఆందోళనకు గురైంది. ప్రభుత్వమే ఇస్తోందంటూ.. కుటుంబ సభ్యులు తమ సొంత డబ్బులు ఇస్తున్నారనే విషయం తెలిసి భోజనం మానేసింది. తల్లి ఆరోగ్యంపై కూతుళ్లు ఆందోళన చెందుతున్నారు. "అయ్యా.. జగన్ మోహన్ రెడ్డి గారూ.. మాకు ఏ సాయం చేయకున్నా ఫర్వాలేదు.. ముసలోళ్ల పింఛన్ తొలగించకండి సార్" అని వేడుకుంటున్నారు.

బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని గోరకాయపాలెంకి చెందిన తరిగోపుల రాములమ్మకు 92 ఏళ్లు. మూడు దశాబ్దాల క్రితం భర్త నాగయ్య చనిపోగా.. చిన్న కూతురు వద్ద నివస్తోంది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్న ఎన్టీఆర్.. రాములమ్మకు వితంతు పింఛన్ మంజూరు చేశారు. అప్పటి నుండి గత ఐదు నెలల క్రితం వరకూ.. జగన్మోహన్ రెడ్డి పాలనలోనూ పింఛన్ వచ్చింది. కానీ.. చిన్న కూతురైన శేషమ్మ భర్త వెంకట్రావు అద్దంకి పురపాలక సంఘంలో పొరుగు సేవల ఉద్యోగిగా పని చేస్తున్నాడు. దానిని సాకుగా చూపిస్తూ అధికారులు ఆమె పింఛన్​ను ఐదు నెలల క్రితం నిలిపివేశారు. ఆసరా పింఛన్ రద్దు కావటంతో ఒత్తిడికి లోనైంది. మూడు రోజులపాటు అవ్వ బువ్వ ముట్టకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పింఛన్ రాకపోయినా.. ఏలోటూ రానివ్వనని కూతురు భరోసా ఇచ్చినా.. నా పింఛన్ సొమ్ముతోనే నేను తింటానంటూ భీష్మించింది. దాంతో ఆమె ప్రాణాలు కాపాడటానికి కుమార్తె తన సొమ్ము రెండు వేల రూపాయలు ఇచ్చారు. వేలిముద్ర వేయించుకోకుండా పింఛన్ ఎలా ఇస్తున్నారని సందేహించడంతో కూతురు ఖంగుతింది. అనంతరం వాలంటీర్ ని పిలిపించి సొంతడబ్బులు అతడి చేత ఇప్పించారు.

వాస్తవానికి మాది ఔట్ సోర్సింగ్ జాబ్. పర్మినెంట్ చేస్తామని చేయలేదు. మా జీతం రూ. 13 వేలు.. మాకు చేతికొచ్చేదాంతో అన్నీ కొనుక్కొని మేం నలుగురం బతకాలి. మేం ఎలాగోలా బతుకుతున్నాం.. నీకు ఏ లోటూ రాకుండా చూసుకుంటాం.. అంటే మా అమ్మ వినట్లేదు... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మా విన్నపం ఒక్కటే.. మీరు ముసలివాళ్ల పింఛన్ మాత్రం తొలగించకండి.. పుణ్యం ఉంటుంది.- శేషమ్మ, రాములమ్మ కూతురు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.