ETV Bharat / state

పెన్షన్ కావాలంటే ప్రాణం పోవాలా?!.. కార్యాలయంలోనే కుప్పకూలిన వృద్ధుడు

author img

By

Published : Apr 6, 2023, 6:55 PM IST

Updated : Apr 7, 2023, 6:59 AM IST

Elderly man dies: వృద్ధాప్యంలో తమకు ఆసరా అవుతుందని అడుగుతున్న పెన్షన్.. వారి చావును బలికోరుతోంది. అన్ని అర్హతలున్నా.. పెన్షన్ అందక, కార్యాలయాల చుట్టూ తిరగలేక.. పండుటాకులు రాలిపోతున్న సందర్భాలు అనేకం. తాజాగా.. బాపట్ల జిల్లా నగరం మండలంలో పెన్షన్ కోసం వెళ్లిన ఓ వృద్ధుడు.. కార్యాలయం ముందే కుప్పకూలి కన్నుమూయడం స్థానికులను కంటతడి పెట్టించింది.

గ్రామ సచివాలయం
గ్రామ సచివాలయం

village secretariat: పెన్షన్ కోసం వచ్చి గ్రామ సచివాలయం ముందు అకస్మాత్తుగా కుప్పకూలి ఓ వృద్దుడు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా నగరం మండలంలో జరిగింది. అద్దంకి వారిపాలెం గ్రామానికి చెందిన కేశన మస్తాన్ రావు(78) వాలంటీర్ అందుబాటులో లేకపోవడంతో పెన్షన్ కోసం గ్రామ సచివాలయం వద్దకు వెళ్లాడు. వేలు ముద్రలు పడటం లేదని సచివాలయం సిబ్బంది రెండు సార్లు తిప్పడంతో ఎండ తీవ్రతకు కార్యాలయం ముందే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సచివాలయం వద్దకు చేరుకున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని వెల్లడించారు. కార్యాలయం ముందు మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. కావాలనే పెన్షన్ రాకుండా చెయ్యాలి అని మూడు రోజులుగా తిప్పుతున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వాలంటీర్ అందుబాటులో ఉండడని ఆరోపించారు. పెన్షన్ కోసం సచివాలయం వద్దకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గ్రామ సచివాలయం ముందు వృద్దుడు మృతి

కేసన మస్తాన్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పింఛను కోసం తిరుగుతూ వృద్ధుడు మరణించడం బాధాకరమని అన్నారు. వృద్ధుడి మృతికి బాధ్యులైన వారిపైచర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్​ చేశారు.

  • బాపట్ల జిల్లా నగరం మండలం అద్దంకివారిపాలెంలో పెన్షన్ కోసం మూడు రోజులుగా తిరుగుతూ కేసన మస్తాన్ అనే వృద్ధుడు మృతి చెందడం బాధాకరం. పెన్షన్ కోసం తిరుగుతూ గ్రామ సచివాలయం వద్దనే ప్రాణాలు కోల్పోవడం విచారకరం. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. pic.twitter.com/u1Ozsl0nJJ

    — N Chandrababu Naidu (@ncbn) April 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అనంతపురం జిల్లా నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో లిఫ్ట్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వివాదాస్పదంగా మారింది. అనంతపురం నగరంలోని చంద్ర హాస్పిటల్ లో జరిగిన ఈ సంఘటనపై మృతుని బంధువుల ఆందోళనకు దిగారు. శ్రీ సత్యసాయి జిల్లా శేషయ్య గారి పల్లికి చెందిన ఆశ్వర్థప్ప అనే వ్యక్తి తన బంధువులను పరామర్శించేందుకు చంద్ర హాస్పిటల్ కి వచ్చారు. పై అంతస్తులో ఉన్న రూంకు వెళ్లేందుకు లిఫ్ట్ కోసం వేచి ఉన్నాడు. అయితే లిఫ్టు వచ్చిందని భావించి డోర్ ఓపెన్ చేశాడు. కానీ అప్పటికి ఇంకా లిఫ్ట్ రాలేదు. ఈ క్రమంలో పైనుంచి వేగంగా వచ్చిన లిఫ్టు అతని మీద పడింది. దీంతో తీవ్ర గాయాల పాలైన అతని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలోపే ఆశ్వర్థప్ప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతిని బంధువులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లిఫ్టు ఆన్ లో ఉన్న సమయంలో డోర్ ఎలా తెరుచుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి నిర్వాహకులు ఘటనపై సరైన రీతిలో స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

కృష్ణాజిల్లా గుడివాడలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్ష్మీరామ సెంటర్‌లో రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు కొంత దూరం ఈడ్చు కెళ్లడంతో, ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రంగా గాయపడిన ఇరువురిని స్థానికులు హాస్పిటల్​కు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వీరిని మండవల్లి మండలం చావలిపాడుకు చెందిన అక్షయ్, నవీన్​గా పోలీసులు గుర్తించారు.


ఇవీ చదవండి:

Last Updated : Apr 7, 2023, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.