ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@7am

author img

By

Published : Dec 14, 2022, 6:58 AM IST

..

7am topnews
ప్రధానవార్తలు7am

  • అమూల్ సంస్థకు చిత్తూరు డెయిరీ లీజు.. మంత్రివర్గం ఆమోదం
    రాష్ట్రంలో ఏపీ పంప్డ్‌ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023 జనవరి నుంచి పెన్షన్​ పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణతోపాటు.. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల్లో వైకాపా కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపులకు కేబినేట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజైన డిసెంబర్‌ 21న 5 లక్షల ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్ష, జరిమానా విధించిన హైకోర్టు
    న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయనందుకు.... తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ నెల 27లోపు హైకోర్టు రిజిస్ట్రార్‌ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • డెంటిస్ట్ కిడ్నాప్‌ కేసు.. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్
    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ డెంటిస్ట్ కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని గోవాలో ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. కాండోలిమ్ బీచ్ వద్ద నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. అతడిని గోవా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వైకాపా కార్పొరేటర్ హుకుం జారీ.. జీ హుజూర్ అంటూ వెనక్కి తగ్గిన అధికారులు
    గుంటూరులో వైకాపా కార్పొరేటర్ దూపాటి వంశిబాబు.. వార్డు సచివాలయ సిబ్బందిపై రెచ్చిపోయారు. 53వ డివిజన్ పరిధిలోని వసంతరాయపురంలో ఆక్రమణల్ని సచివాలయ సిబ్బంది తొలగిస్తుండగా ఆయన అడ్డుకున్నారు. ఆక్రమణలతో మీకు పనేంటని వారిని ప్రశ్నించారు. వెళ్లి పెన్షన్లు ఇచ్చుకోవాలని... అనవసర విషయాల్లోకి రావొద్దని హెచ్చరించారు. కులం పేరుతో వివక్ష చూపిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే నేను కమిషనర్ తో మాట్లాడతా.. మీరేమీ తొలగించాల్సిన పనిలేదని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఖండాలు దాటిన ప్రేమ.. ఒక్కటైన భారతీయ యువకుడు, జర్మనీ యువతి
    భారతీయ​ యువకుడు.. జర్మన్​ యువతి వివాహబంధంతో ఒక్కటయ్యారు. భారతీయ సంప్రదాయం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ వేడుకలు ఎక్కడ జరిగాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐపీఎస్​పై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళపై కాల్పులు.. హైకోర్టుకు వెళ్లే ముందే..
    ఝార్ఖండ్​లో ఓ గిరిజన మహిళపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఓ కేసుకు సంబంధించి ఆమె హైకోర్టులో హాజరు కావడానికి కొన్ని గంటల ముందే.. ఆమెపై దాడి జరిగింది. దీంతో ఈ దాడిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సరిహద్దులో ఘర్షణపై స్పందించిన చైనా.. ఏం చెప్పిందంటే?
    అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో డిసెంబర్‌ 9న భారత్‌ దళాలాలతో జరిగిన ఘర్షణపై చైనా విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. సరిహద్దులో పరిస్థితి స్థిరంగానే ఉందంటూ చెప్పుకొచ్చింది. అన్ని ఒప్పందాలను భారత్‌ అమలు చేయాలని కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మూడు రంగుల్లో ట్విట్టర్ వెరిఫికేషన్ టిక్.. ఎవరికి ఏ కలర్ ఇస్తారంటే?
    ఇప్పటిదాకా బ్లూ కలర్​లో ఉన్న ట్విట్టర్ వెరిఫికేషన్‌ మార్క్‌ ఇప్పుడు మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ అధినేత ఎలన్​ మస్క్​ పేర్కొన్నారు. అలానే ట్విటర్‌ సంస్థలో 'ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ కౌన్సిల్‌'ను యాజమాన్యం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రంజీల్లోకి అడుగుపెట్టిన సచిన్ తనయుడు అర్జున్ తెందూల్కర్​..
    తండ్రి గొప్ప క్రికెటర్‌. కానీ తనయుడు మాత్రం అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. తాజాగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అయితే తన రాష్ట్రం కాకుండా పక్కన ఉన్న గోవా తరఫున రంజీల్లోకి అడుగుపెట్టడం విశేషం. అతడెవరో తెలుసా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇటు రాజమౌళి, కమల్‌ హాసన్‌.. అటు రిషబ్‌ శెట్టి, దుల్కర్‌.. ఒకే చోట కలిసి..
    ప్రముఖ దర్శకులు రాజమౌళి, లోకేశ్‌ కనగరాజ్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తదితరులు ఒకే చోట చేరితే ? రిషబ్‌, దుల్కర్‌, జాన్వీ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ సంగతేంటో తెలుసుకుందామా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.