రాష్ట్రంలో యథేచ్ఛగా గంజాయి రవాణా.. బాపట్లలో 98 కేజీలు పట్టివేత

author img

By

Published : Feb 21, 2023, 10:26 PM IST

Ganja seized in Martoor
Ganja seized in Martoor ()

Ganja seized in Martoor: రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయే.. విచ్చలవిడిగా గంజా విక్రయాలు, రవాణా జరుగుతోంది. తాజాగా గంజాయి అక్రమ రవాణా చేసే అంతర్రాష్ట్ర ముఠాను బాపట్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి లక్షల విలువ చేసే కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా విశాఖలో స్టీల్ ప్లాంట్ వద్ద గంజా సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్రంలో యధేచ్చగా గంజాయి రవాణాలు.. బాపట్లలో 98 కేజీల పట్టివేత

Ganja seized in Martoor: గంజాయి అక్రమరవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని.. గంజాయి అక్రమదారులపై ఉక్కుపాదం మోపుతామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు.. బాపట్ల పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద మార్టూరు పోలీస్​లు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో కారును అపి సోదా చేయగా.. సుమారు రూ 4 లక్షల 41వేల రూపాయల విలువ గల 98 కేజీల గంజాయి గుర్తించామన్నారు. వెంటనే పోలీసులు కారును స్వాధీనం చేసుకుని.. ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారన్నారు.. కేరళకు చెందిన పుదియపురైల్, అశోక్, చమ్ము, వడక్కన్చెర్రీ అనే ముగ్గురు, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన అత్తిలి ప్రభాకర రావు, అనకాపల్లి జిల్లాకు చెందిన బొండాడ కోదండ రాముడులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

ముద్దాయిలందరికి గంజాయి సేవించే అలవాటు ఉందని.. అక్రమంగా తీసుకొచ్చిన గంజాయిని అమ్ముతుంటారని తెలిపారు. మొదటి ముద్దాయి సమ్మద్ లారీ డ్రైవర్​గా పనిచేస్తూ గతంలో కొద్ది మొత్తంలో గంజాయిని రవాణా చేస్తుండేవాడని.. రెండవ ముద్దాయి అయిన అశోక్ బెంగళూరు ప్రాంతంలో గంజాయి విక్రయిస్తూ ఉంటాడు.. మూడవ ముద్దాయి చమ్ము గంజాయి అక్రమ రవాణా చేసే వారికి సహాయకుడిగా ఉంటాడు.. మరో ఇద్దరు ముద్దాయిలు ప్రభాకర్, కోదండరాములు ఒడిశా బోర్డర్ ప్రాంతంలో గిరిజనుల దగ్గర గంజాయి కొనుగోలు చేసి అమ్మే దళారీలుగా మారారని పేర్కొన్నారు.. సమ్మద్​కి ప్రభాకర్, కోదండరాములకి మధ్య.. గతంలో పరిచయాలు ఉన్నాయి. ఇటీవల సమ్మద్​కి బెంగళూరులో అశోక్ కూడా పరిచయం అవటంతో వీరందరూ కలిసి ఒడిశాలోని గంజాయిని మద్దిగరువు దగ్గరకు తీసుకురాగా, ప్రభాకర్ రావు, కోదండ రాముడు ఇరువురు వారి వద్ద నుండి 2 కేజీల గంజాయి ప్యాకెట్ రూ. ఐదు వేల చొప్పున 49 గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసి.. అక్కడనుంచి రహస్యంగా నక్కపల్లి టోల్గేట్ సమీపంలోకి తరలించి, కేఎల్ 11 డబ్ల్యూ 4308 నెంబర్ గల టాటా ఇండిగో కారులో.. ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి బెంగళూరుకు బయలుదేరారు.

ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాపట్ల డీఎస్పీ పర్యవేక్షణలో మార్టూరు సీఐ థెరిసా ఫిరోజ్ నేతృత్వంలో ఎస్సై కమలాకర్ తన సిబ్బందితో ప్రత్యేక బృందంగా ఏర్పడి వాహనాలపై నిఘా ఏర్పాటు చేశారు.. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో ఉన్నవారు పోలీసులను చూసి నిందితులు ఉడాయించారు.. కారును వెంబడించిన పోలీసులు కారును ఆపి కారును పరిశీలించగా గంజాయి ప్యాకెట్లు కారులో ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకొని నిందితులను.. అరెస్ట్ చేశారు.. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన బాపట్ల డీఎస్పీ, ఏ శ్రీనివాస రావు, మార్టూరు సీఐ ఎస్​కె ఫిరోజ్, మార్టూరు ఎస్​ఐ కమలాకర్​ను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.

విశాఖలో గంజాయి: విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ కేబీఆర్ పార్క్ వద్ద గంజా సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అనంతరం స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు.. సమావేశంలో సౌత్ ఏసీపీ త్రినాథ్ మాట్లాడుతూ కణితి బాలెన్సింగ్ రిజర్వాయిర్ సమీపంలో కొంతమంది గంజా సేవిస్తున్నారన్న సమాచారం పోలీసులకు రావడంతో అక్కడకు వెళ్లి చూడగా ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తున్నారు. వాళ్లను పట్టుకుని విచారించగా అగనంపూడిలోని పాన్ షాపు నిర్వాహకురాలు.. దాసరి రాజమ్మ అమ్ముతున్నట్టు చెప్పారు. అసలు గంజాయి ఎక్కడ నుంచి తెస్తున్నారు.. అని ఆరాతీయగా ఒడిశా కటక్​కు చెందిన జెల్లి నాయక్ తెస్తున్నట్టు బయటపడింది. దీంతో ఇరువురిని అరెష్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్టు ఏసీపీ త్రినాథ్ తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీనివాసురావు, ఎస్ఐ స్వామినాయుడు, వరలక్ష్మి పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.