అరుదైన పిల్లి కిడ్నాప్​.. రంగంలోకి పోలీసులు!

author img

By

Published : Jan 9, 2023, 8:16 PM IST

Cat Theft In Vanasthalipuram

Cat Theft In Vanasthalipuram: పోలీసు స్టేషన్​లో సార్ నా డబ్బులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. నా మెడలో బంగారం కొందరు దుండగులు లాకెళ్లారు. పార్కింగ్​లో ఉన్న నా బైక్​ పోయింది.. ఇలా చాలా కంప్లెట్స్ విన్నాం. కానీ ఈసారి తెలంగాణ, హైదరాబాద్​లోని వనస్థలిపురం పోలీసులకు ఒక కొత్త కంప్లెట్ వచ్చింది. అదే సార్ నేను ఎంతో ఇష్టంగా.. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఎత్తికెళ్లిపోయాడు.. మీరే నాకు న్యాయం చేయడంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకి ఆ వ్యక్తి ఇష్టపడే ఆ పిల్లి ప్రత్యేకత ఏంటో తెలుసా..!

Cat Theft In Vanasthalipuram: నగదు, బంగారం, వాహనాలు ఎత్తికెళ్లిన దొంగలు చూశాం కానీ వీడు ఎవడోగాని పెంపుడు జంతువులు మీద చూపు పడినట్లుంది. దర్జాగా బైక్​పై వచ్చి ఓ ఇంటి ముందు చక్కగా ఆడుకుంటున్న పిల్లిని అలా లటుక్కున పట్టుకొని చంకాలో పెట్టుకొని వెళ్లిపోయాడు. తన పిల్లి కనిపించకపోవడంతో కలవరానికి గురైన యువకుడు చివరకు పోలీస్​ స్టేషన్​ మెట్లు ఎక్కాడు. ఎంతో ఇష్టంగా, ప్రాణానికి ప్రాణంగా పెంచకుంటున్నా తన పిల్లిని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడని పోలీసులు ముందు తన బాధను వెల్లబుచ్చుకున్నాడు.

పిల్లే కదా లైట్​ తీసుకోరాదు అని స్థానికులు చెప్పగా దానికి యజమాని మహమూద్ వారిపై మండిపడి దాని ప్రత్యేకతలు వివరించాడు. అది అరుదైన హౌ మనీ(Khow Manee) రకానికి చెందిన పిల్లి అని ఒక కన్ను బ్లూ.. మరో కన్ను గ్రీన్ రంగులో ఉండటం ఈ పిల్లి యొక్క ప్రత్యేకతని చెప్పాడు. 18 నెలల ఈ పెంపుడు పిల్లి చాలా అరుదైనదని.. సుమారు రూ. 50 వేల ఖరీదు ఉంటుందని వెల్లడించాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. శనివారం రాత్రి 9 గంటలు సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి ఆడుకుంటున్న పిల్లిని బలవంతంగా తీసుకెళ్లినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించాయి.

'సార్​ నా పిల్లి పోయింది.. మీరే కనిపెట్టగలరు' స్టేషన్​లో యువకుడు ఫిర్యాదు

"శనివారం రాత్రి మా ఇంటి ముందు మేము పెంచుకుంటున్న పర్యషన్ క్యాట్​ను గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తీసకుకొనిపోయాడు. దాని విలువ రూ.50వేలు ఉంటుంది. ఒక కన్ను బ్లూ.. మరో కన్ను గ్రీన్ రంగులో ఉండటం ఈ పిల్లి యొక్క ప్రత్యేకత పోలీసులు నిందితుడ్ని గుర్తించి నా పిల్లిని నాకు మరల తెచ్చిపెడతారని స్టేషన్​లో ఫిర్యాదు చేశాను".- మహమూద్, పిల్లి యజమాని

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.