ETV Bharat / state

మత్స్యకార సంఘం అధ్యక్ష, డైరెక్టర్ల ఎన్నికలను రద్దు చేయించిన వైసీపీ నేతలు! తప్పుబట్టిన మత్స్యకారులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 11:00 PM IST

YCP Leaders Canceled the Fishermen Elections : మత్య్సకారుల సహకార సంఘాల ఎన్నికలు జరిపేందుకు వైసీపీ నాయకులు భయపడుతున్నారు. ఏందుకంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నవారు మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షులుగా, డైరెక్టర్లుగా ఎన్నికైతే రానున్న ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురౌతాయని భావించిన ముగ్గురు ప్రజాప్రతినిధులు ఏకంగా ఎన్నికలే రద్దు చేయించిన ఉదంతం అనంతపురం జిల్లాలో జరిగింది.

YCP_Leaders_Canceled_the_Fishermen_Elections
YCP_Leaders_Canceled_the_Fishermen_Elections

YCP Leaders Canceled the Fishermen Elections : మత్య్సకారులు తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నారన్న కారణంతో మత్య్సకారుల సహకార సంఘాల ఎన్నికలు జరపకుండా.. వైసీపీ నాయకులు ఏకంగా ఎన్నికలే రద్దు చేయించారు. అనంతపురం జిల్లాలోని ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేయటంతో మత్స్యశాఖ ముఖ్యకార్యదర్శి ఏకపక్ష నిర్ణయంతో రాత్రికిరాత్రే ఎన్నికల రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని, ఎన్నికలు జరిపితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని కారణాలు చూపి ప్రిన్సిపాల్ సెక్రటరీ ఈ ఉత్తర్వులు ఇచ్చారు.

CM Jagan Cheated Fishermen: మాట ఇచ్చి.. మడమ తిప్పి.. మత్స్యకారులను నిండా ముంచిన ముఖ్యమంత్రి జగన్​

Elections of Fishermen Cooperative Societies : ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన 75 మంది మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు అధికారుల తీరుపై మండిపడ్డారు. మత్స్యశాఖ డీడీ కార్యాలయం ఎదుట మత్య్సకారులు ఆందోళన నిర్వహించి, అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవల్సిన ఓటర్లంతా ఇక్కడే ఉండగా, శాంతి భద్రతల సమస్య ఎక్కడ అయ్యిందని అధికారులను నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్యాలయం ఆవరణంలో మత్స్యకార సంఘాల అధ్యక్షులంతా.. జిల్లా అధ్యక్షుడితోపాటు పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు.

Cancellation of Fishermen Elections : ఉమ్మడి అనంతపురం జిల్లాలో జలాశయాలు, చెరువులు, కుంటల పరిధిలోని గ్రామాల్లో వంద వరకు మత్స్యకార సహకార సంఘాలు ఉన్నాయి. జిల్లాలో బెస్త సామాజిక వర్గానికి జనాభా తక్కువగా ఉండటంతో.. దశాబ్దాల కాలంగా వీరు మత్స్యకార వృత్తిలో ఉన్నారు. మొదటి నుంచి గంగపుత్రుల అత్యధిక కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఈ ఒక్క కారణంతోనే బెస్త సామాజిక వర్గం వారు జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు, డైరెక్టర్లు కాకూడదని వైసీపీ ప్రజాప్రతినిధులు ముగ్గురు ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ ఎన్నికలు జరిగితే మత్స్యకారుల ప్రాభల్యం పెరిగిపోయి.. వారికి పట్టం కట్టినట్లవుతుందని ఆ ప్రజాప్రతినిధులు కుట్రచేశారని ఆరోపణలున్నాయి. నేడు జరగాల్సిన ఎన్నిక రద్దు చేయటంపై మత్స్యకార సంఘాల అధ్యక్షులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చనిపోతున్న మత్స్యసంపద.. ఉపాధి లేక రోడ్డున పడిన గంగపుత్రులు

Notification for Election of Fishermen : అనంతపురం జిల్లాలో వందకు పైగా మత్స్యకార సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా సంఘాలకు మత్స్యకారులే అధ్యక్షులుగా ఉన్నారు. మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్ష, డైరెక్టర్ల ఎన్నికకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాల వ్యాప్తంగా ఓటర్లుగా ఉన్న.. మత్స్యకార సంఘాల అధ్యక్షులు బుధవారం జిల్లా కేంద్రానికి తరలి వచ్చారు. నేటి ఎన్నికలు రద్దు చేస్తున్నట్లు అర్ధరాత్రి ప్రకటించామని.. ఎందువచ్చారని మత్స్యశాఖ అధికారులు ఓటర్లను ప్రశ్నించారు.

'మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం'

Elections of Anantapur District Fishermen : దీంతో మత్స్యకార సంఘాల అధ్యక్షులు అధికారుల తీరును తప్పుపడుతూ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఓటర్లంతా కార్యాలయం ఆవేరణలోనే తమ జిల్లా పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా 64 మంది ఆమోదంతో ఎన్నికలు జరిపామని, అధ్యక్ష, డైరెక్టర్లను ఎన్నుకున్నట్లు మత్స్యకార సంఘం నాయకులు ప్రకటించారు. అనంతపురం జిల్లా మత్స్యశాఖ అధికారులు కాని, పోలీసులు కాని ఎలాంటి నివేదిక ఇవ్వకుండానే మత్స్యకార ఎన్నికల నిర్వహణ.. శాంతిభద్రతల సమస్యకు దారితీస్తుందని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు ఇవ్వటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మత్స్యకార సంఘం అధ్యక్ష, డైరెక్టర్ల ఎన్నికలు రద్దు చేసిన వైసీపీ నేతలు! తప్పుబట్టిన మత్స్యకారులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.