ETV Bharat / state

ఫౌంటెన్​ను తలపించిన.. వాల్వు పైప్​లైన్ లీకేజ్

author img

By

Published : Apr 8, 2021, 7:59 PM IST

శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం పైప్ లైన్​కు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా నీళ్లు ఎగసిపడ్డాయి. దీంతో ఆ దృశ్యం ఫౌంటెన్​ను తలపించింది. ఈ దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా వీక్షించారు.

Valvo pipeline leakage
ఫౌంటెన్ ను తలపిస్తున్న వాల్వు పైప్​లైన్ లీకేజ్

ఫౌంటెన్ ను తలపిస్తున్న వాల్వు పైప్​లైన్ లీకేజ్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో కంబదూరు బైపాస్ సమీపంలో శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం పైప్ లైన్​కు గండిపడింది. పైప్​లైన్​కు గండి పడటంతో నీరు భారీగా నీరు వృథా అవుతోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు పెన్నా అహోబిలం రిజర్వాయర్ నుంచి నీరు వెళ్లే ఈ పైపులైను తరచూ ఇలా మరమ్మతులకు గురవుతోంది. అధికారులు మరమ్మతుల కోసం పక్కనే ఉన్న వాల్వును తెరిచారు. ఆ సమయంలో నీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. లీకైన పైప్​లైన్ నుంచి నీరు ఎగసిపడుతుండటంతో.. ఫౌంటెన్​ను తలపించింది. ఇది చూసేందుకు రోడ్డుపై ప్రయాణించేవారు, పొలాల్లోని రైతులు ఆసక్తి కనబరిచారు.

ఇవీ చూడండి..

వ్యవసాయశాఖకు కత్తిమీద సాములా వేరుశనగ విత్తన సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.