ETV Bharat / state

Milk wastage: పేదలకు అందాల్సిన పౌష్టికాహారం.. రోడ్డు 'పాలు'!

author img

By

Published : Jul 27, 2021, 11:28 AM IST

Govt Milk Packets
రోడ్డు పక్కన పడేసిన పాల ప్యాకెట్లు..

పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్న పిల్లలు, గర్భవతులకు ఇవ్వాల్సిన పాల పాకెట్లను.. అనంతపురం జిల్లా కదిరి మండలం కౌలేపల్లి సమీపంలోని రైల్వే వంతెన వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపాలు చేశారు. దాదాపు వంద లీటర్ల పాల ప్యాకెట్లు రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. పేదలకు అందాల్సిన ఈ పాలను.. ఇళా రోడ్డు పాలు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు పక్కన పడేసిన పాల ప్యాకెట్లు..

పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్న పిల్లలు, గర్భవతులకు ఐసీడీఎస్ ద్వారా ఇవ్వాల్సిన పాల పాకెట్లు...​ సిబ్బంది నిర్లక్ష్యంతో రోడ్డు పాలయ్యాయి. అనంతపురం జిల్లా కదిరి మండలం కౌలేపల్లి సమీపంలోని రైల్వే వంతెన వద్ద విజయ డెయిరీకి సంబంధించిన వందల పాల పాకెట్లు రోడ్డు పక్కన పడేశారు. రక్తహీనతతో బాధపడే గర్భవతులు, పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారి ఆరోగ్య స్థితి మెరుగయ్యేందుకు ప్రభుత్వం ఈ పాల ప్యాకెట్లను సరాఫరా చేస్తోంది.

కరోనా కష్టకాలంలో పౌష్టికాహారం దక్కక వందలాది పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీడీఎస్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 100 లీటర్ల పాలు నేలపాలయ్యాయి. పాల పాకెట్​ల పంపిణీలో సిబ్బంది అలసత్వం కారణంగా లబ్ధిదారులకు అందించడం ఆలస్యమై ఉంటుందని, వాటిని కేంద్రాల్లో పెట్టుకోవడం ఇబ్బందిగా భావించి గుట్టుచప్పుడు కాకుండా రోడ్డు పక్కన పడేసి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. పేదలకు అందాల్సిన పాలను రోడ్డు పాలు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

Lepakshi Temple: లేపాక్షికీ యునెస్కో గుర్తింపు?

తీవ్రస్థాయి కొవిడ్‌ బాధితుల్లో మందగిస్తున్న తెలివితేటలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.