ETV Bharat / state

Tragedy in Immersion విషాదాన్ని నింపిన వినాయక నిమజ్జనం

author img

By

Published : Sep 1, 2022, 8:35 AM IST

Tragedy in immersion of Ganesh: వినాయక చవితి ఆ ఇంట విషాదాన్ని నింపింది. వినాయక నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవ శాత్తు ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు. వారిలో ఒకరు మృతి చెందగా మరోకరు గల్లంతయ్యారు. గల్లంతైన అమ్మాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Ganesh idol immersion turns tragic
ిఅనంతపురం వినాయక నిమజ్జనంలో విషాదం

Tragedy in immersion of Ganesh: పోలీసులు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతీ సంవత్సరం వినాయక చవితి నిమజ్జనం సమయంలో అపశృతులు జరుగుతున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తోంది. అలాంటి ఘటనే అనంతపురం రాప్తాడు పండమేరు చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రాప్తాడులో.. వినాయక విగ్రహం నిమజ్జనంలో విషాదం నెలకొంది. అనంతపురం సాయినగర్‌ వాసులు.. గణపతి నిమజ్జనం కోసం.. రాప్తాడులోని పండమేరు కాలువకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురు వ్యక్తులు నీటిలో పడిపోయారు. వారిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. శ్రీరాములు, జయశ్రీ అనే బాలిక ప్రవాహంలో కొట్టుకుపోయారు. శ్రీరాములు మృతదేహం లభ్యం కాగా.. గల్లంతైన బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.