ETV Bharat / state

రాప్తాడులో టెన్షన్​.. టీడీపీ-వైసీపీ సోషల్ మీడియా వార్.. పరస్పరం రాళ్లదాడి

author img

By

Published : Mar 6, 2023, 5:42 PM IST

Stone Pelting Between TDP YCP Leaders: అనంతపురం జిల్లాలో టెన్షన్​ వాతావరణం చోటు చేసుకుంది. సోషల్​ మీడియాలో వైసీపీ-టీడీపీ సవాళ్లు విసురుకోవడం.. ఈరోజు వైసీపీ గుంటూరు జిల్లా సోషల్​ మీడియా ఇన్​చార్జ్​ స్వయంగా రాప్తాడుకు రావడంతో ఆందోళన నెలకొంది. అంతేకాకుండా మరోసారి టీడీపీ నాయకులకు సోషల్​ మీడియా ఇన్​చార్జ్​ మరోసారి సవాల్​ విసరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నాయకులు, మద్దతుదారుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. వైసీపీ నాయకులు రాళ్లు రువ్వుకోవడంతో టీడీపీ కార్యకర్త, పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డారు.

సోషల్ మీడియా వార్
social media war

రోడ్జు మీదకొచ్చిన టీడీపీ-వైసీపీ సోషల్ మీడియా వార్

Stone Pelting Between TDP YCP Leaders : రాప్తాడు అభివృద్ధిపై గుంటూరు జిల్లా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి హరికృష్ణారెడ్డి టీడీపీ నేతలపై పలు ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు రోజులుగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో సామాజిక మాధ్యమాలు వేదికగా గొడవ జరుగుతోంది. ఇవాళ వైసీపీకి చెందిన హరికృష్ణారెడ్డి గుంటూరు నుంచి రాప్తాడు టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి మరోసారి సవాల్ చేస్తూ, టవర్ క్లాక్ వద్దకు రావాలని రెచ్చగొట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు టవర్ క్లాక్ వద్దకు చేరుకోవటంతో పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్​కు తరలించాక, హరికృష్ణారెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తలు టవర్ క్లాక్ వద్దకు వస్తున్నారని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కేవలం టీడీపీ కార్యకర్తలను అదుపు చేయటానికి మాత్రమే యత్నిస్తుండడం, వైసీపీ కార్యకర్తలను, హరికృష్ణారెడ్డిని నిలువరించకపోవటంతో పరస్పరం రాళ్లదాడికి దిగారు. రాళ్లదాడిలో కానిస్టేబుల్​తో పాటు, టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. హరికృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెండు రోజులుగా వైరల్ అవుతున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మరింత రెచ్చిపోయిన హరికృష్ణారెడ్డి, వైసీపీ కార్యకర్తలు ఆరోపణల తీవ్రత పెంచి, ఏకంగా టవర్ క్లాక్ వద్దకు వచ్చి దాడులకు దిగినట్లు టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

పరిటాల వర్సెస్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి : అనంతపురం జిల్లా రాప్తాడులో పరిటాల వర్సెస్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిల మధ్య వార్ గుంటూరుకు చేరింది. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మా నేత గొప్ప అంటే మా నేత గొప్ప అంటూ సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకున్నారు. పరిటాల కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అటువైపు వ్యక్తి దమ్ముంటే రాప్తాడు వెళ్లి మాట్లాడు అంటూ సవాల్ విసిరారు. గుంటూరు జిల్లాలో ఉండి మాట్లాడటం కాదు.. రాప్తాడుకు వస్తే ఎవరు ఏంటో తెలుస్తుందంటూ సవాల్ విసిరారు.

అయితే ఇవాళ రాప్తాడుకు సదరు గుంటూరు వ్యక్తి వచ్చాడు. నేను రాప్తాడు వచ్చాను.. మీ పరిటాల వారు దేవుని భూమి కబ్జా చేసి టీడీపీ కార్యాలయం కట్టిన విషయం చూడండి అంటూ వీడియో రిలీజ్ చేశాడు. జాకీ పరిశ్రమ స్థలం వద్దకు కూడా వెళ్లి 150కోట్ల భూమిని కంపెనీకి ఇచ్చారని.. కనీసం ఇక్కడ పాకలు కూడా లేవంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఇది మీ వాళ్ల నిజస్వరూపం.. అనంతపురం టవర్ క్లాక్ దగ్గరకు, రాప్తాడుకు వచ్చి చెబుతున్నానంటూ ఆ వ్యక్తి కామెంట్స్ చేశాడు. టీడీపీ నేతలు టవర్ క్లాక్ వద్దకు వెళ్లడంతో పరిస్థితి టెన్షన్ టెన్షన్​గా మారింది. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. టవర్ క్లాక్ వద్దకు చేరుకున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు ప్రస్తుతం టవర్ క్లాక్ సమీపంలో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ఖాదర్ పై దాడి : తెలుగు యువత అధ్యక్షుడు ఖాదర్ గత కొద్ది రోజుల క్రితం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడనివైసీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు తాడిపత్రి పట్టణంలోని రామచంద్ర లాడ్జ్ సమీపంలో ఉన్న ఆర్టీవో కార్యాలయంలో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆర్టీవో ఏజెంట్ కార్యాలయం ధ్వంసం అయింది, అలాగే ఇద్దరికి గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు చెందిన వారిని స్టేషన్​కు తరలించి విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.