ETV Bharat / state

ధర్మవరంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు

author img

By

Published : Feb 18, 2021, 7:47 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా మంత్రి శంకర్ నారాయణ హాజరయ్యారు. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు.

hockey tornament in anantapur district
హాకీ టోర్నమెంట్​కు అతిధిగా మంత్రి శంకర్​ నారాయణ

అనంతపురం జిల్లా ధర్మవరంలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు అతిథిగా మంత్రి శంకర్ నారాయణ విచ్చేశారు. పతాకావిష్కరణ చేసి హాకీ టోర్నమెంట్​ను ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఆయనకు గౌరవ వందనం చేశారు.

తల్లిదండ్రులు పిల్లలను క్రీడలవైపు ప్రోత్సహించాలని.. చదువుతో పాటు క్రీడలు అవసరమని మంత్రి అన్నారు. క్రీడలు వల్ల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతాయని చెప్పారు. ధర్మవరంలో ఆడుతున్న క్రీడాకారులు రాణిస్తున్నారని.. వారికి తనవంతు తోడ్పాటు ఇస్తానని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

తెగుళ్ల నివారణపై అవగాహన.. రైతులకు కీలక సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.