ETV Bharat / state

SEB Attacks: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్​ఈబీ విస్తృత దాడులు.. అక్రమ మద్యం స్వాధీనం

author img

By

Published : Jul 1, 2021, 7:21 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా.. అక్రమ మద్యం అమ్మకాలపై ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో సిబ్బంది, పోలీసులు.. నజర్ పెంచారు. విస్తృతంగా సోదాలు చేశారు. నిందితులను పట్టుకుని భారీగా సరకును స్వాధీనం చేసుకున్నారు.

seb raids
seb raids

కృష్ణా జిల్లాలో..

ఉయ్యురు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు.. తోట్ల వల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. కృష్ణా నది ఒడ్డున 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నాటుసారా తయారీ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని.. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

వత్సవాయి మండలం మంగోలు వద్ద 321 తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ నుంచి నలుగురు వ్యక్తులు మద్యాన్ని తీసుకు వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మద్యంతో పాటు ఐదు వేల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ప్రకాశం జిల్లాలో...

యర్రగొండపాలెం మండలంలోని నాటు సారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించి బెల్లం ఊటను ద్వంసం చేశారు. మండలంలోని గండి చెరువు అటవీ ప్రాంతంలో సారా తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన 800 లీటర్ల బెల్లం ఊటతో పాటు సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని ధ్వంసం చేశారు.

అనంతపురం జిల్లాలో...

పెనుకొండ శివారులో ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి 44వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న 250 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం స్వాధనం చేసుకున్నారు. రెండు లారీలు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అదేవిధంగా పెనుగొండ మండలంలోని శెట్టిపల్లి గ్రామ శివారులో ద్విచక్రవాహనాలపై మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వద్ద నుంచి 660 టెట్రా పాకెట్లో కర్ణాటక మద్యం, రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. రెండు కేసుల్లో రెండు లారీలు, రెండు ద్విచక్ర వాహనాలు, మొత్తం 910 ప్యాకెట్ల కర్ణాటక మద్యం సీజ్ చేసి, నలుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు వివరించారు.

ఇదీ చదవండి:

BRAMHAMGARI MATAM: హైకోర్టుకు చేరిన బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యం వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.