ETV Bharat / state

రెండు గంటల్లో... 1600 మంది ఆకలి తీర్చారు!

author img

By

Published : May 25, 2020, 2:56 PM IST

ఉన్నది కేవలం రెండుగంటలే.. ఈ సమయంలోపే 1600 మంది వలస కూలీలకు ఆహారం తయారు చేయాలి. కనీసం తాగడానికి నీరు కూడా లేకుండా ముంబయి నుంచి తమిళనాడుకు ప్రయాణిస్తున్నారు. కడుపులు మలమలా మాడిపోతున్నాయి. సమస్య తెలుసుకున్న అనంతపురం ఎస్పీ.. ఎలాగైనా వారి ఆకలి తీర్చాలని ప్రయత్నించారు. ఎంతో మంది సహకారంతో ఆ కూలీల ఆకలి తీర్చి.. వారి కళ్లల్లో సంతోషం చూశారు.

police helped migrants at gunthakallu
వలస కూలీల ఆకలి తీర్చిన పోలీసులు

శ్రామిక్‌ రైలులో ముంబయి నుంచి తమిళనాడుకు ప్రయాణిస్తున్న వలస కూలీల ఆకలి తీర్చి గుంతకల్లు పోలీసులు ఆదర్శంగా నిలిచారు. 1,600 మంది వలస కూలీలు ముంబయి నుంచి తమిళనాడులోని విల్లుపురానికి శ్రామిక్‌ రైలులో శనివారం రాత్రి 11 గంటలకు బయలుదేరారు. రైలు ఆదివారం గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. కూలీలకు ఎక్కడా అన్నపానీయాలు దొరకలేదు.

విషయం తెలుసుకున్న తమిళనాడుకు చెందిన భూమిక ట్రస్టు సభ్యులు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించి ఇక్కడి ఎస్పీ సత్య ఏసుబాబును అప్రమత్తం చేశారు. అనంతరం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఆర్డీటీ సహకారంతో గుంతకల్లు పోలీసులు కూలీలకు ఆహారం, మంచినీళ్ల సీసాలను అందించారు. దీంతో కూలీలంతా సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్ ఆంక్షల నడుమ 'ఈద్​'​ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.