ETV Bharat / state

సీపీఎస్ ఆందోళనలో పాల్గొనవద్దంటూ ఆంక్షలు, దివ్యాంగ టీచర్​కు నోటీసులు

author img

By

Published : Aug 25, 2022, 7:44 PM IST

Notice to disabled teacher సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఉపాధ్యాయ సంఘాలు సెప్టెంబరు 1న విజయవాడలో మిలియన్ మార్చ్​కు పిలుపునిచ్చాయి. నిరసన కార్యక్రమంలో పాల్గొనకూడదంటూ దివ్యాంగ ఉపాధ్యాయునికి నోటీసులు ఇచ్చారు.

Notice to disabled teacher
ఉపాధ్యాయుడికి నోటిసులు

Notice to teacher: సీపీఎస్ రద్దు కోసం సెప్టెంబర్​ 1న ఉద్యోగ సంఘాలు విజయవాడలో మిలియన్​ మార్చ్​కు పిలుపునిచ్చాయి. ఇందుకోసం అన్ని ప్రాంతాల నుంచి ఉద్యోగులు విజయవాడకు బయల్దేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంలో ఉద్యోగ సంఘ నేతలకు, పలువురు ఉద్యోగులకు నోటీసులిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఓ దివ్యాంగ టీచర్​కు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అనంతపురంలోని కక్కలపల్లి పంచాయతీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఎర్రిస్వామి దివ్యాంగుడు. రెండు కళ్ళు లేకున్నా ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాడు. ముఖ్యమంత్రి పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్​ రద్దు చేస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. సీపీఎస్ రద్దు కోసం ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఉద్యమాలు విదితమే. అయితే రెండు కళ్ళు లేని తనలాంటి వారికి నోటీసు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పరిశీలించి ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు.

Bandi Srinivasa Rao on CPS: పాలకులు సెప్టెంబరు 1న సీపీఎస్ తీసుకువచ్చారని.. అప్పటినుంచి సెప్టెంబరు 1ని విద్రోహ దినంగా పాటిస్తున్నామని ఏపీఎన్జీవో అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. సెప్టెంబరు 1న 26 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద నల్ల రిబ్బన్​లు ధరించి నిరసనలు తెలుపుతామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయటం లేదని ఆయన మండిపడ్డారు. మినిమం స్కేల్ ఇచ్చినా.. సర్వీసు రెగ్యులరైజ్ చేయలేదని, తెలంగాణ ప్రభుత్వ తరహాలో ఏపీ ప్రభుత్వం కుడా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీపీఎస్​ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు ఏపీజేఏసీ ప్రధాన కార్యదర్శి హృదయరాజు గుర్తు చేశారు. జీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులకు ఉపయోగం లేదన్నారు. రాజస్థాన్, చత్తీస్‌ఘర్​లలో అక్కడి ప్రభుత్వాలు సీపీఎస్​ను రద్దు చేశాయని, అక్కడి రిపోర్ట్ ఆధారంగా ఏపీ ప్రభుత్వం కూడా స్పందించాలన్నారు. ఉద్యోగులపై పెట్టిన కేసులు పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.