తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది.. బాలకృష్ణకు కృతజ్ఞతలు: ఎంపీ విజయ సాయిరెడ్డి

author img

By

Published : Feb 1, 2023, 7:19 PM IST

ఎంపీ విజయ సాయిరెడ్డి

MP Vijaya Sai Reddy visited Narayana Hrudayalaya Hospital: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా గుండెపోటుతో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను చూసేందుకు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి నేడు ఆసుపత్రికి విచ్చేశారు. అనంతరం తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆయన బాగోగులను దగ్గరుండి చూసుకుంటున్న నందమూరి బాలకృష్ణకు విజయ సాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

MP Vijaya Sai Reddy visited Narayana Hrudayalaya Hospital: సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. ఆయన ఈరోజు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి విచ్చేసి.. తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం విజయ సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఆసుపత్రి సిబ్బంది మంచి వైద్య సేవలందిస్తున్నారన్నారు. తారకరత్న గుండెతో పాటు ఇతర అవయవాలన్నీ బాగున్నాయని, మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోందని వెల్లడించారు. త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నానని.. తారకరత్న అనారోగ్యానికి గురైన రోజు నుంచి దగ్గరుండి ఆయన బాగోగులు చూసుకుంటున్న బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని విజయసాయి రెడ్డి తెలిపారు.

తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది..

మరోపక్క నందమూరి తారకరత్నకు చికిత్స అందిస్తోన్న నారాయణ హృదయాలయ ఆస్పత్రి వర్గాలు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలను తెలియజేస్తున్నారు. ఆసుపత్రిలో తారకరత్నకు ప్రత్యేక బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా కార్డియాలజిస్ట్‌లు, ఇంటెసివిస్ట్‌లు, ఇతర స్పెషలిస్ట్‌లు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో తారకరత్నను చూసేందుకు ఇప్పటికే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విచ్చేశారు.

గత నాలుగు రోజులక్రితం చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్న విషయ తెలిసిందే. ఆ పాదయాత్రలో ఆయన కొద్ది దూరం నడిచి.. ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.